Aug 04,2023 00:18

ప్రజాశక్తి-గోపాలపురం
రైతుల అభివృద్ధికి వైసిపి ప్రభుత్వం లక్ష్యమని చేస్తోందని గోపాలపురం ఎంఎల్‌ఎ తలారి వెంకట్రావు అన్నారు. గురువారం గోపాలపురం శివారు లోగల తాడిపూడి సబ్‌ లిఫ్టు-2 వద్ద ఎంఎల్‌ఎ తలారి మోటారు ఆన్‌ చేసి నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నీరు లేని బీడు భూములను సస్యశ్యామలం చేసిన ఘనత దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి కే దక్కుతుందని అన్నారు. వైఎస్‌ఆర్‌ పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం 2005-2006 సంవత్సరంలో తాడిపూడి గోదావరి నది గట్టుపై తాడిపూడి ప్రాజెక్టు పనులు మొదలుపెట్టారని అన్నారు. తాడిపూడి మెయిన్‌ కెనాల్‌ 13.500 కిలోమీటర్‌ వద్ద ఆఫ్‌ టెక్‌ నుండి నీటిని తోడి నిర్మించేందుకు లిఫ్ట్‌-2 పంపు హౌస్‌ నిర్మించారని అన్నారు.లిఫ్ట్‌ -2 ద్వారా గోపాలపురం, దేవరపల్లి ,కొయ్యలగూడెం, నల్లజర్ల నాలుగు మండలాల కు సుమారు 27,800 ఎకరాలకు నీరు అందించేందుకు నిర్మాణం చేపట్టారని అన్నారు. అయితే అనివార్య కారణాలవల్ల దీని ద్వారా ప్రస్తుతం 12 వేల ఎకరాలకు మాత్రమే నీరు అందింస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షులు కూసం రామ్మోహన్‌ రెడ్డి, ఎంపీపీ ఉండవల్లి సత్యనారాయణ, ఎస్కే ఖాదర్‌ వలీ, ఇరిగేషన్‌ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ టి. శ్రీనివాస్‌, జడ్పిటిసి కే .లలిత తదితరు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.