Jul 15,2023 23:34

ప్రజాశక్తి-రాజానగరం
రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని జిల్లా వైసిపి కన్వీనర్‌, రాజానగరం ఎంఎల్‌ఎ జక్కంపూడి రాజా అన్నారు. చాగల్నాడు ఎత్తిపోతల పథకం కాలువ నీళ్లను కాతేరు సమీపంలో పంప్‌ హౌస్‌లో వైసిపి రాజమహేంద్రవరం రూరల్‌ కో-ఆర్డినేటర్‌ చందన నాగేశ్వర్‌తో కలిసి ఎంఎల్‌ఎ జక్కంపూడి రాజా విడుదల చేశారు. ఈ సందర్భంగా జక్కంపూడి రాజా మాట్లాడుతూ చాగల్నాడు ఎత్తిపోతల పథకం కాలువ ద్వారా ఆయుకట్టు పరిధిలో 20 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తామన్నారు. స్వర్గీయ మాజీ సిఎం వైఎస్‌. రాజశేఖర రెడ్డి ప్రారంభించిన జలయజ్ఞం పథకం వలన సాగునీటి పథకాలు అందుబాటులోకి వచ్చాయన్నారు. గత ప్రభుత్వం సాగునీటి రంగంపై నిర్లక్ష్యం వహించిందన్నారు. ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తామని, ఏ ఒక్క రైతు నీటి కోసం ఇబ్బంది పడకూడదని తెలిపారు. కార్యక్రమంలో కోరుకొండ జెడ్‌పిటిసి సభ్యుడు కర్రీ.నాగేశ్వరరావు, సీతానగరం ఎంపిపి గుర్రాల జోత్స్న, సీతానగరం మండల కన్వీనర్‌ గంటా శ్రీను, కోరుకొండ మండల కన్వీనర్‌ ఆడపా కనకరాజు, జిల్లా రైతు విభాగ అధ్యక్షులు అడబాల చినబాబు, ఇఇ రంగా రావు, ఇరిగేషన్‌ డిఒలు ఆనంద్‌ బాబు, వెంకట్రావులు, ఇరిగేషన్‌ ఎఇ శివప్రసాద్‌, ఇరిగేషన్‌ జెఇలు వినోద్‌, సుమంత్‌ సంధ్య తదితరులు పాల్గొన్నారు.
సాగునీరు విడుదల
సీతానగరం రాజానగరం నియోజకవర్గంతో పాటు వివిధ మెట్ట నియోజక వర్గాలకు సాగు నీరందించే కార్యక్రమంలో భాగంగా చాగల్నాడు, కొత్తవెంకటనగరం ఎత్తిపోతల పథకం నుండి రూరల్‌ కో-ఆర్డినేటర్‌ చందన నాగేశ్వర్‌ తో కలిసి రైతులకు సాగునీరు విడుదల చేశారు. అనంతరం తొర్రిగడ్డ,పుష్కర ఎత్తిపోతల పథకాల నుంచి దిగువున ఉన్న ఆయుకట్టుకు సాగునీటిని ఎంఎల్‌ఎ రాజా విడుదల చేశారు. ముందుగా ఆయా పథకాల వద్ద సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించి,నీటిని విడుదలచేశారు.