Feb 05,2023 23:26

రైల్వే కాంట్రాక్టు కార్మికులతో మాట్లాడుతున్న సిఐటియు నాయకులు నరసింహారావు, పూర్ణిమారాజు

ప్రజాశక్తి - రాజమహేంద్రవరం
రైల్వే కాంట్రాక్టు కార్మికులకు కార్మిక చట్టాలు అమలు చేయాలని సిఐటియు రాష్ట్ర నాయకులు నరసింహారావు, జిల్లా కార్యదర్శి బి.పూర్ణిమరాజు డిమాండ్‌ చేశారు. ఆదివారం వారు రైల్వే కాంట్రాక్టు కార్మికులతో మాట్లాడారు. రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్‌లో బాక్స్‌ బోరులుగా 25 ఏళ్లుగా పనిచేస్తున్న కార్మికులకు ఎటువంటి కార్మిక చట్టాలు అమలు కావడం లేదన్నారు. కనీస వేతనం, ఇఎస్‌ఐ, పిఎఫ్‌ వంటి సౌకర్యాలు లేవన్నారు. రైల్వేస్టేషన్‌లో వివిధ విభాగాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్‌ కార్మికులకు ఉద్యోగ భద్రత, కనీసవేతనం నెలకు రూ.26వేలు, లీవు రూల్స్‌, బోనస్‌, మహిళలకు మెటర్నిటీ లీవులు కల్పించాలని పలుమార్లు వినతిపత్రాలు ఇచ్చినా పట్టించుకోవట్లేదన్నారు. తక్షణమే కార్మికుల కనీస సౌకర్యాలు, చట్టాలు అమలు చేయాలన్నారు. ఈ సమావేశంలో ప్రయివేటు హాస్పిటల్స్‌ స్టాఫ్‌ యూనియన్‌ జనరల్‌ సెక్రటరీ ఎం.శ్రీనివాసరావు, రైల్వే కార్మికులు నాగేశ్వర రావు, సోమరాజు, సుబ్రహ్మణ్యం, రామారావు, సురేష్‌, సత్తిబాబు, రామకృష్ణ, శ్రీనివాస్‌, నాగరాజు, కృష్ణ, ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.