ప్రజాశక్తి-రాజమహేంద్రవరం రైల్వే లోకో రన్నింగ్ స్టాఫ్ (డ్రైవర్లు)పై అధికారుల వేధింపులు విరమించుకోవాలని పలువురు డిమాండ్ చేశారు. లోకో రన్నింగ్ స్టాఫ్ ఆధ్వర్యాన గురువారం నిర్వహించిన సభలో సిఐటియు జిల్లా కార్యదర్శి, కోశాధికారులు బి.పూర్ణిమరాజు, కెఎస్‌వి.రామచంద్రారావు మాట్లాడారు. ఇటీవల రైల్వేలో డ్రైవర్లు, సహాయ డ్రైవర్లను మనోవ్యధకు గురిచేసి తీవ్రమైన నిర్ణయాలు తీసుకోవడానికి కారణమైన అధికారుల అసంబద్ధమైన ఆదేశాలకు నిరసనగా అన్ని రైల్వే లోకో సంఘాలు ఏకమై ఈ సభ నుర్వహిస్తున్నట్టు తెలిపారు. అధికారుల వేధింపులకు వ్యతిరేకంగా తీవ్ర నిరసన తెలిపారు.










