ప్రజాశక్తి - నిడదవోలు
ఒడిశాలో రైలు ప్రమాద మృతులకు పట్టణ ప్రజల సంక్షేమ సంఘం, సిఐటియు, కెవిపిఎస్, రోటరీ క్లబ్ ఆఫ్ నిడదవోలు మిడ్ టౌన్ ఆధ్వర్యంలో నిడదవోలు రైల్వే స్టేషన్ వద్ద కొవ్వొత్తులతో ఆదివారం నివాళులర్పించారు. రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఈ సందర్భంగా పట్టణ ప్రజల సంక్షేమ సంఘం అధ్యక్షులు జువ్వల రాంబాబు మాట్లాడారు. ఒడిశా రైలు ప్రమాద ఘటన అత్యంత బాధాకరమన్నారు. రైలు ప్రమాదానికి బాధ్యత వహిస్తూ కేంద్ర రైల్వే శాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మృతుల కుటుంబాలకు తక్షణమే నష్ట పరిహారం చెల్లించాలన్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని, వారిని అన్ని విధాలా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. మిగిలిన ప్రయాణికుల ఆచూకీ త్వరగా తెలుసుకునేలా చర్యలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో పెమ్మరాజు పార్థసారథి, కాకులపాటి శ్రీధర్, గండి శ్రీనివాసరావు, షాహి, రమేష్, డానియేల్, వి.ప్రభాకర్‌రావు గణేష్, దేవి, ప్రసాద్, ప్రయాణికులు పాల్గొన్నారు.










