Feb 12,2023 23:22

ప్రజలతో మాట్లాడుతున్న శేషారావు

ప్రజాశక్తి - నిడదవోలు
నిడదవోలు మండలం రావి మెట్లలో టిడిపి నిడదవోలు నియోజకవర్గం ఇన్‌ఛార్జి బూరుగుపల్లి శేషారావు ఆధ్వర్యంలో ఆదివారం 'ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి' కార్యక్రమాన్ని నిర్వహించారు. నాయకులు, కార్యకర్తలతో కలిసి శేషారావు గ్రామంలో ప్రతి ఇంటినీ సందర్శించారు. ప్రస్తుత వైసిపి పరిపాలనలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా శేషారావు మాట్లాడుతూ ప్రస్తుత వైసిపి పరిపాలనలో రాష్ట్రం అన్ని రంగాలలోనూ వెనుకబడిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని వర్గాల ప్రజలతో పాటు ప్రభుత్వ ఉద్యోగులు కూడా జీతాలు అందక అనేక ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. కాబట్టి ఇటువంటి అరాచక పాలనను అంతమొందించి వచ్చే ఎన్నికల్లో టిడిపిని గెలిపించుకొని చంద్రబాబును ముఖ్యమంత్రిగా చేసుకుందామని పిలుపునిచ్చారు. యువగళం యాత్రను అడ్డుకుందామని వైసిపి ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేస్తున్నా ప్రజల సాయంతో లోకేష్‌ యాత్రను కొనసాగిస్తున్నారన్నారు. లోకేష్‌ పాదయాత్రను ఎవరూ ఆపలేరని శేషారావు అన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షులు వెలగన సూర్యారావు, సొసైటీ మాజీ అధ్యక్షులు పాలనాటి లీలాభాస్కర్‌ తదితరులు పాల్గొన్నారు