ప్రజాశక్తి - గోపాలపురం
సచివాలయాలు, వాలంటర్లీ వ్యవస్థల రూపకల్పనతో దేశంలోని రాష్ట్రాలకు ఆంధ్ర ప్రదేశ్ ఆదర్శంగా నిలిచిందని ఎంఎల్‌ఎ తలారి వెంకట్రావు అన్నారు. శుక్రవారం భీమోలులో రూ.80 లక్షలతో నిర్మించిన సచివాలయం, ఆర్‌బికె, ఆరోగ్య కేంద్ర భవనాలను సర్పంచ్ అన్నెపు వెంకటలక్ష్మి ఆధ్వర్యంలో ఎంఎల్‌ఎ తలారి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ మండలంలో 18 సచివాలయాలు, నియోజకవర్గంలో 81 గ్రామ సచివాలయాలు, రైతు భరోసా ఆరోగ్య కేంద్రాలను నిర్మిస్తున్నామన్నారు. నాలుగైదు గ్రామాల్లో ఇప్పటికే ఆర్‌బికెలను ప్రారంభించామన్నారు. మిగిలిన వాటిని ఏప్రిల్ నాటికి పూర్తి చేసి ప్రారంభిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జడ్‌పిటిసి సభ్యులు కాకులపాటి లలిత, ఎంపిపి ఉండవల్లి సత్యనారాయణ, ఎంపిడిఒ ఆర్.శ్రీదేవి, వైసిపి మహిళా విభాగం మండల అధ్యక్షులు ఎండపల్లి కవిత, సర్పంచ్ అన్నెపు వెంకటలక్ష్మి, ఎంపిటిసి సభ్యులు కోడె రామలక్ష్మి, వెలగా శ్రీరామ్మూర్తి, కురుకూరి ధనలక్ష్మి, రాంపండు, సాయి, ఎం.రవి, ఎస్‌కె.ఖాదర్‌వల్లీ తదితరులు పాల్గొన్నారు.










