ప్రజాశక్తి-రాజమహేంద్రవరం దేశంలోనే ప్రథమ బ్రైడల్ స్టోర్ 'ప్లష్' వెడ్డింగ్ సూపర్ మార్కెట్ రాజమహేంద్రవరంలో అందుబాటులోకి వచ్చింది. జెఎన్ రోడ్‌లో కిఫ్ భవనంలో గురువారం స్టోర్‌ను ఘనంగా ప్రారంభించారు. ఎంపీ మార్గాని భరత్ రామ్, మోనా మార్గాని, రుడా చైర్‌పర్సన్ మేడపాటి షర్మిలారెడ్డి, కొత్త విజయ రాజ్యలక్ష్మి, ప్రముఖ యాంకర్, నటి సుమ కనకాల, నటి సంగీత, సెలబ్రిటీలు రచిత, నీలిమలు స్టోర్‌ను, వివిధ విభాగాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా సెలబ్రిటీలు సందడి చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ కోసూరి చండీప్రియ, శ్రీ దేవి సన్స్ రమేష్ హేమ్ చంద్, కొత్త బాలమురళీకష్ణ, నగరానికి చెందిన పలువురు ప్రముఖ మహిళలు పాల్గొన్నారు.










