ప్రజాశక్తి- రాజమహేంద్రవరం రూరల్ : జగనన్నకు చెబుదాం కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి వచ్చే ఆర్జీల పరిష్కారం చేసే విధానంలో మనపై మరింత బాధ్యత పెరిగిందని కలెక్టర్ డాక్టర్ కె.మాధవీలత పేర్కొన్నారు. మంగళవారం ఉదయం కలెక్టరేట్‌లో జరిగిన జగనన్నకు చెబుదాం వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమంలో కలెక్టర్, ఎస్పీ, ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. తాడేపల్లిలోని సిఎం విడిది కార్యాలయం నుంచి జగనన్న కే చెబుదాం కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కె.మాధవీలత మాట్లాడుతూ, ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రతి సోమవారం స్పందన కార్యక్రమం ద్వారా పరిష్కారం చూపడం జరుగుతోందని అన్నారు. ఇప్పుడు జేకేసి కార్యక్రమానికి ముఖ్యమంత్రి పేరు ''జగనన్న'' పేరున ఉండడం తో మనపై మరింత బాధ్యత తో పాటుగా జవాబుదారీ తనం కూడా పెరిగిందని కలెక్టర్ పేర్కొన్నారు










