- విశాఖ ఉక్కు అమ్మకం ఏపీ ప్రజలకు తీవ్ర అన్యాయమే.
- పరిశ్రమలు పెట్టాల్సిన మోడీ విశాఖ ముక్కు అమ్మడం సిగ్గుచేటు.
- విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు నిరసనగా రాస్తారోకో.
- కార్యకరర్తలు,పోలీసులు తోపులాట మధ్య రాస్తారోకో.
- బీజేపీ, వైసీపీ లకు ప్రజలే తగిన గుణపాఠం చెబుతారన్న నాయకులు.
ప్రజాశక్తి-రాజమహేంద్రవరం : విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు నిరసనగా విశాఖ ఉక్కు పరిరక్షణ కమిటి పిలుపు మేరకు బుధవారం రాజమహేంద్రవరంలో స్థానిక శ్యామల సెంటర్ వద్ద సిఐటియు, ఏఐటియుసి, ఐఎఫ్టియు, సిపిఎం, సిపిఐ, కాంగ్రెస్, ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ, పిడిఎస్ యు, ప్రజా సంఘాలు, పౌర సంఘాలతో కూడిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో రాస్తారాకోని ర్వహించారు. రాస్తారోకో సందర్భంగా కార్యకర్తలు పోలీసులకు మధ్య స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. రాస్తారోకోక అనుమతి లేదంటూ త్రీ టౌన్ పోలీసులు ఆందోళన కర్నూలు చెదరగొట్టే ప్రయత్నం చేయగా నాయకులు కార్యకర్తలు రోడ్డుపైన కూర్చుని నిరసన తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం పోలీసులు వైఖరికి నిరసించారు. అనంతరం జరిగిన సభలో సిపిఎం జిల్లా కార్యదర్శి టి అరుణ్, సేటి జిల్లా ప్రధాన కార్యదర్శి బి రాజులోవ, ఏటీసీ జిల్లా కార్యదర్శి కె.రాంబాబు, ఐఎఫ్టియు రాసిన నాయకులు కె.జోజి, కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షులు బాలేపల్లి మురళీధర్ సిపిఐ సీనియర్ నాయకులు నల్ల రామారావు మాట్లాడుతూ కేంద్ర మోడీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కి విభజన హామీలు అమలు చేయకుండా తీవ్ర అన్యాయం చేసిందని, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఏకైక పెద్ద పరిశ్రమ విశాఖ ఉక్కును మరింత సామర్థ్యంతో నడపాల్సిన కేంద్ర ప్రభుత్వం ప్రైవేటు పురం చేస్తామని, లేదంటే అమ్మేస్తామని, ఎవరు కొనకపోతే మూసేస్తామని చెప్పడం ఆంధ్రప్రదేశ్ ప్రజలను అవమానించడమే అన్నారు. 23 మంది యువకులు బలిదానంతో సాధించుకున్న విశాఖ ఉక్కును మోడీ ప్రభుత్వం అమ్మేస్తుంటే రాష్ట్రంలో అధికార వైసిపి ప్రభుత్వం నిమ్మకు నీరు ఎత్తినట్లు వ్యవహరిస్తుందని, విశాఖకు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడుతున్న సంఘాలు పార్టీలు నాయకులను ముందస్తు అరెస్టుల పేరుతో ఉద్యమాల్ని అడ్డుకుంటున్నారని పరోక్షంగా విశాఖ ఉక్కుని ప్రైవేటుకరించే మోడీకి సహకరిస్తున్నారని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ లో బిజెపి ఏ మొహం పెట్టుకుని వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఓట్లు అడుగుతారని, బిజెపికి వంతపడే వైసీపీకి ప్రజలు ఎందుకు ఓట్లు వేయాలని ప్రశ్నించారు. విశాఖ ఉక్కు నాశనం కోరుకుంటున్న బిజెపి, వైసీపీలను వచ్చే ఎన్నికల్లో ప్రజలు వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాజమహేంద్రవరం నగర కార్యదర్శి బి పవన్, సిపిఐ నగర్ కార్యదర్శి కొండలరావు, సేటు జిల్లా ఉపాధ్యక్షులు ఎస్ఎస్మూర్తి,కె.రామకృష్ణ,జిల్లా కార్యదర్శి బి.పూర్ణిమ రాజు,కృష్ణ,ఏ ఐటిసి జిల్లా సహాయ కార్యదర్శి సప్ప.రమణ, ఆర్.కొండలరావు, యడ్ల లక్ష్మి, సేపే.రమణమ్మ, కాంగ్రెస్ పార్టీ నాయకులు ముళ్ళ మాధర్ సీఐటీయూ నాయకులు సత్తిరాజు, ప్రసాద్, సింహాద్రి కిరణ్ కుమార్ సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ రాజమహేంద్రవరం నగర కార్యదర్శి PDSU జిల్లా నాయకులు కె.భానుప్రసాద్, PDSU పట్టణ కార్యదర్శి ధర్మేష్ బాబు , శ్రీను ,మావోరెడ్డి, సూరిబాబు, విక్రమ్, సీఐటీయూ నాయకులు సోమేశ్వరరావు, పి. వెంకటేశ్వరరావు, ఎస్. వెంకటేశ్వర రావు, ఎస్. ఎఫ్. జిల్లా అధ్యక్షులు వి.రాంబాబు, అప్పల నర్షయ్య, టి సావిత్రి తదితరులు పాల్గొన్నారు.










