- విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్
ప్రజాశక్తి- గోకవరం : జిల్లాలో విద్య శాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ పలు వసతి గృహాలు పాఠశాలలు కళాశాలలను తనిఖీల్లో భాగంగా శుక్రవారం రాత్రి 10 గంటలకు గోకవరం ప్రభుత్వ జూనియర్ కళాశాలను విద్య శాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ కళాశాలలో నాడు నేడు కార్యక్రమంలో 20 లక్షల రూపాయలతో చేస్తున్న పనులను జాప్యం జరగడంతో సంబంధిత అధికారులు ఇంజనీరింగ్ అధికారులు కళాశాల ప్రిన్సిపాల్ లను ఆరా తీశారు. 20 లక్షల రూపాయలతో నిర్వహిస్తున్న నాడు నేడు పనులుపై వివరాలను సిబ్బందిని ఆరా తీశారు సిబ్బంది వద్ద వివరాల లేకపోవడంతో అధికారులపై ఆగ్రహించి నాడు-నేడు పనులపై నిర్లక్ష్యం తగదని జరుగుతున్న పనులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్జెడి జీ నాగమణి డీఈవో అబ్రహం పాల్గొన్నారు










