Jan 27,2023 15:35

ప్రజాశక్తి-కడియం : గణతంత్ర దినోత్సవ సందర్భంగా పేరెంట్స్ గ్రౌండ్లో జిల్లా కలెక్టర్ మాధవి లత చేతుల మీదుగా ఉత్తమ సేవా పురస్కారం అందుకున్న కడియం ఎంపీడీవో కే.రత్నకుమారిని శుక్రవారం పలువురు అభినందించారు. ఎంపీడీవో కార్యాలయంలో రత్నకుమారిని కలిసి దుశ్శాలువా కప్పి, పూలమాలలు వేసి శుభాకాంక్షలు తెలిపారు. ఎంఈఓ వి.లజపతిరాయ్ నేతృత్వంలోని జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత చిలుకూరి శ్రీనివాసరావు ఉపాధ్యాయ సంఘ నేత కె.జయరాజ్, మండల ఇంజనీరింగ్ అధికారి కె.వీరభద్రరావు, మండల విద్యా వనరుల  ఆర్.రమణ, సీఆర్పీలు రూత్ హెలెన్, వీర్రాజు, ఇతర సిబ్బంది రమణ, కిషన్, రాజు, తదితరులు అభినందన తెలిపిన వారిలో ఉన్నారు.