Mar 16,2023 15:50

ప్రజాశక్తి-చాగల్లు : చాగల్లులో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమనేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ ఉన్న మట్ల మనశ్శాంతి మాట్లాడుతూ, ఆంధ్రరాష్ట్రం కోసం అసువులు బాసిన అమరజీవి పొట్టి శ్రీరాములు ఆశయం, త్యాగం వృథాకావన్నారు. శ్రీరాములు జీవితాన్ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. పంచాయతీ కార్యదర్శి ఎల్ రవికుమార్ వైఎస్ఆర్ పార్టీ నాయకులు  సీనియర్ నాయకులు గంట్రోతు సూర్యనారాయణ ఆర్యా వైశ్య సంఘ సభ్యులు శ్రీకాకుళం ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. చాగల్లు శాఖ గ్రంథాలయంలో గ్రంంధాలయ అధికారు గద్దె శ్రీనివాసరావు చంద్రవరం శాఖ గ్రంధాలలో కేే సుమన్ కుమార్ ఉన్న గట్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏ.సుజాత పొట్టి శ్రీరాములు జయంతి ఘనంగా నిర్వహించారు.