Sep 23,2023 14:50

ప్రజాశక్తి-పెరవలి మండలం (తూర్పుగోదావరి జిల్లా) : పెరవలి ఐసిడిఎస్ కార్యాలయం పరిధిలో పెరవలి సెక్టార్ ప్రాజెక్ట్ పరిధి ముక్కామాల గ్రామంలో అంగన్వాడి కేంద్రాలలో శనివారం గర్భిణీ స్త్రీలకు సీమంతలు ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని ఉన్న 16 మంది గర్భిణీ స్త్రీలకు  చీర జాకెట్ గాజులు పసుపు కుంకుమ డ్రై ఫ్రూట్స్ పళ్ళు స్వీట్లు ఈ సందర్భంగా వారికి అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచి కేతా త్రిమూర్తులు మండల అధ్యక్షులు వీరమల్లు సత్యనారాయణ వైస్ ఎంపీపీ వేండ్ర శ్రీనివాసు ఎంపీటీసీ గండేపల్లి రామకృష్ణ సొసైటీ అధ్యక్షులు రేలంగి ఏసు గ్రామ వైఎస్ఆర్సిపి అధ్యక్షులు అరిగెల శ్రీనివాసు  సిడిపిఓ శ్రీలక్ష్మి  సూపర్వైజర్ సిహెచ్ లక్ష్మి అంగన్వాడి ఉపాధ్యాయులు ఆయాలు గర్భిణీ స్త్రీలు  నాయకులు తదితరు పాల్గొన్నారు.