- ఉన్నతాధికారులు కోలువైయుండి జిల్లా హెడ్ క్వార్టర్గా విరాజిల్లుతున్న ధవలేశ్వరంలో...
- ప్రధాన రహదారి కాలువ గట్టుపైనే చెత్త డంపింగ్ చేయాల్సిన పరిస్థితి...
- తగలబడుతున్న చెత్తతో ఏర్పడుతున్న వాయు కాలుష్యం ...
- ప్రజలు ఇబ్బందులు పడుతున్న అధికారులు పట్టించుకోని దుస్థితి...
- కాలువ కూడుకు పోతున్న గట్టు దెబ్బతింటున్న చోద్యం చూస్తున్న ఇరిగేషన్ అధికారులు...
ప్రజాశక్తి - ధవళేశ్వరం : ధవలేశ్వరం గ్రామంలో గోదావరి డెల్టా కాలువ చెంతనే ధవలేశ్వరం పంచాయతీ వారు యదేచ్ఛగా గోదావరి నది తీరాన డంపింగ్ యార్డ్ ల మార్చివేసి ధవలేశ్వరంలో ధవలేశ్వరం ఊరి చెత్తనంతా తీసుకువచ్చి ఎదైచ్చక గోదావరి నది ఒడ్డున ట్రాక్టర్లతో డైరెక్ట్ గా గోదావరిలోకి డంపింగ్ చేస్తున్నారు. కలెక్టర్ ఇలకాలోనే ఈ విధంగా జరుగుతున్న కనీసం డిపిఓ ఆఫీస్ పక్కనే ఉన్న బాధ్యత రహితంగా ధవళేశ్వరం పంచాయతీ వారు యదేచ్ఛగా కాలువ చెంతనే కిలోమీటర్ పొడవునా చెత్త డంపింగ్ చేస్తూ ప్రోక్లైన్లతో ఆ డంపింగ్ చేసిన చెత్తనంతా గోదావరిలోకి నెట్టేస్తూ రాత్రుళ్ళు నిప్పు పెట్టి వెళ్ళిపోతున్నారు. పారిశుధ్య కార్మికులు చెత్త తీసుకొచ్చి వేయడం వలన ఆ ప్రాంతమంతా దుర్వాసన రావడంతో పాటు పారిశుద్ధ్య కార్మికులు నిప్పు పెట్టడంతో ప్లాస్టిక్ ఇతర వ్యర్ధ పదార్థాలతో కూడిన పొగ పీల్చిడం వలన కాలుష్య కొరలో రహదారి మీద వెళ్తున్న వాహనదారులకు ఆ చుట్టూ ఉన్న పొగ విపరీతంగా కమ్మేయడంతో యాక్సిడెంట్లు నిత్యం జరుగుతూనే ఉన్న పట్టించుకున్న పాపాన్న పోవట్లేదు అంతేకాకుండా సమీపంలోనే ఉన్న గవర్నమెంట్ బాలుర్ హై స్కూల్ విద్యార్థులు టీచర్స్ ఆ కాలుష్యంతో కూడిన గాలిని పిలుస్తూ కాలుష్య కోరల్లో చిక్కుకుంటున్నారు. దీనిపైన అధికారులు చర్యలు తీసుకొని చెత్తను డంపింగ్ యార్డ్ లో వేసేలా చర్యలు తీసుకుని ఈ సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు, వాహనదారులు కోరుతున్నారు.










