ప్రజాశక్తి - ఉండ్రాజవరం : ప్రజలకు నిరంతర సాగునీటి సరఫరా కొరకు ఏర్పాటైన జల జీవన్ మిషన్ ద్వారా ట్యాంకుల ఏర్పాటుకు మండలంలోని చివటం, ఉండ్రాజవరం, తాడిపర్రు దమ్మెన్ను, సూర్యారావుపాలెం, కాల్దారి గ్రామాలు ఎంపికైనట్లు రాజమండ్రి డివిజన్ ఆర్డబ్ల్యూఎస్ డి ఈ, టీ శ్రీనివాస్ తెలిపారు. మండలంలోని ఆయా గ్రామాలలో ట్యాంకుల నిర్మాణానికి స్థల పరిశీలన చేయవలసి ఉందని, సోమవారం చివటం, సూర్యారావు పాలెం, కాల్దరి గ్రామాలలో డిఈతో పాటు స్థల పరిశీలన చేసినట్లు ఉండ్రాజవరం మండల ఏ ఈ ఆర్ దుర్గాభవాని తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సర్పంచ్ ఈడుపుగంటి సత్యనారాయణ, కార్యదర్శి కే కృష్ణవేణి, చివటం ఇంజనీరింగ్ అసిస్టెంట్ సిహెచ్ పృథ్వి, పాలంగి ఇంజనీరింగ్ అసిస్టెంట్ జి రామకృష్ణ, కాంట్రాక్టర్ ఎం దుర్గాప్రసాద్, వాలంటీర్ జీ క్రాంతి కుమార్ తదితరులు పాల్గొన్నారు.










