ప్రజాశక్తి-గోపాలపురం మండల ప్రజా పరిషత్ కార్యాలయం, ఇతర మండల ప్రభుత్వ కార్యాలయాల వద్ద అధికార పార్టీకి చెందిన ఫ్లెక్సీలతో నాయకులు నింపేయడంతో పార్టీ కార్యాలయమో, లేక ప్రభుత్వ కార్యాలయాలలో తెలియక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని పలువురు ప్రజలు అంటున్నారు. మండలంలోని పలువురు, ప్రజలు, స్థానికులు మాట్లాడుతూ గోపాలపురం ఎంపిడిఒ కార్యాలయంంతో పాటు, పిఆర్, ఐసిడిఎస్ ప్రాజెక్టు, సచివాలయం, ఎంఇఒ, హౌసింగ్, చింతలపూడి ఇరిగేషన్, డ్వాక్రా వెలుగు కార్యాలయం, రైతు భరోసా కేంద్రం, ఐకెపి, భవిత పాఠశాల, మండల ప్రభుత్వ కార్యాలయాలతో పాటు మండల పరిషత్ సమావేశపు హాల్లో నిరుద్యోగులకు కంప్యూటర్ శిక్షణ కేంద్రం నిర్వహిస్తున్నారు. వీటి చుట్టూ ప్రహరీ ఏర్పాటు చేసి అన్ని కార్యాలయాలకు ముందుగా రెండు మార్గాలు ఉన్నారు. ఇలా ఎంపిడిఒ కార్యాలయాన్ని ఆనుకుని అనేక ప్రభుత్వ కార్యాలయాలు ఉండడంతో మండలంలోని ప్రజలు ఏదో ఒక సమస్యపై కార్యాలయం వద్దకు వస్తున్నారు. వృద్ధులు, చదువు లేని వారు కూడా పలువురిని అడ్రస అడుగుతూ ప్రభుత్వ కార్యాలయాలకు నిత్యం ఏదో ఒక సమస్యపై ప్రభుత్వ కార్యాల యాలకు నిత్యం వస్తుంటారు. గత నెల 23న గోపాల పురంలో నిర్మించిన తహశీల్దార్ కార్యా లయం, సచివాలయ భవనాలను రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు, ఎంపీ మార్గాని భరత్, ఎంఎల్‌ఎలు ప్రజాప్రతినిధులు ప్రారంభించారు. వారి రాకను పురస్కరించుకుని మండల పరిషత్ కార్యాలయం అంతా ఇలా పెద్ద ఎత్తున ఫ్లెక్సీలతో నింపేశారు. సుమారు నెల రోజులు అవుతున్నా మండల పరిషత్ కార్యాలయంలో అడుగడుగున కట్టిన ఫ్లెక్సీలు నేటికి తొలగించలేదు. ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లే మార్గంలో, బయట వైపు, ప్రభుత్వ కార్యాలయం వద్ద కూడా భారీ ఫ్లెక్సీలతో నింపేశారు. దీంతో అది ప్రభుత్వ కార్యాలయామో లేక వైసిపి కార్యాలయమో తెలియక ప్రజలు తికమకపడుతున్నారు. నిత్యం ఏదో ఒక సమస్యపై ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చేవారు వైసిపి ఫ్లెక్సీలు చూసి పార్టీ కార్యాలయమేమో అనుకుంటూ తికమక పడుతున్నారు. దీనిపై అక్కడ ఉన్న ప్రభుత్వాధికారులు కూడా నోరు మెదపకపోవడంతో ప్రజలు పడుతున్న అవస్థలు చూసిన వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.










