ప్రజాశక్తి-గోపాలపురం సగ్గొండ గ్రామపంచాయతీ వద్ద ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఫార్మా కంపెనీ నిర్మాణంపై సోమవారం సర్పంచ్ ఎండపల్లి శేఖర్ బాబు, పంచాయతీ కార్యదర్శి అనురాధ ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించారు. నూతనంగా నిర్మిస్తున్న బల్క్ పరిశ్రమపై ప్రజాభిప్రాయాలు తెలిపారు. ఈ పరిశ్రమ నిర్మాణానికి పలువురు సానుకూలంగానూ మరికొందరు వ్యతిరేకంగాను గ్రామస్తులు మాట్లాడారు. గ్రామ సమీపంలో ఏర్పాటు చేస్తున్న ఫార్మా కంపెనీ నిర్మాణంకు వ్యతిరేకంగా ప్రజలు పలు అభ్యంతరాలు తెలిపారు. దీనిపై ఫోన్‌లో జాయింట్ కలెక్టర్ తేజ్ భరత్ దష్టికి తీసుకువెళ్లగా ఫ్యాక్టరీ నిర్మాణంపై అభ్యంతరాలు ఉంటే రాతపూర్వకంగా ఇవ్వాలని దానిపై పరిశీలన చేపడతామని జెసి తెలిపారు. ఈ సందర్భంగా సర్పంచ్ శేఖర్ బాబు మాట్లాడుతూ భావితరాలకు మంచి పర్యావరణం అందించేందుకు ప్లాస్టిక్ ను నిషేధించాలని చెట్లను పెంచాలని కోరారు. సిఐ అనుసూరి శ్రీనివాసరావు, దేవరపల్లి ఎస్‌ఐ శ్రీహరి, గోపాలపురం ఎస్‌ఐ కె.రామకృష్ణ పాల్గొన్నారు.










