ప్రజాశక్తి-పెరవలి : పెరవల్లి లైన్స్ క్లబ్ నూతన అధ్యక్షునిగా కోల సీతయ్య నాయుడు జులై 5వ తేదీ బాధ్యతలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం జనసేన ఎంపీటీసీగా ఇతర వ్యాపార బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మండల పరిధిలోని అన్ని గ్రామాలను వైద్య ఆరోగ్య మెడికల్ క్యాంపులు పలు సామాజిక సేవ కార్యక్రమాలు అందరి సహకారంతో నిర్వహిస్తానని ఆయన తెలిపారు. క్లబ్ అభివృద్ధికి తమ వంతు సహాయ సహకారాలు ఎల్లవేళలా అందిస్తానన్నారు.










