Jun 04,2023 23:20

సాయం అందిస్తున్న పూర్వపు విద్యార్థులు

ప్రజాశక్తి- కడియం
కడియం జడ్‌పిహెచ్‌లో 2004-05 సంవత్సరానికి చెందిన పూర్వపు విద్యార్థులు ఉదారతను చాటుకున్నారు. ఆ బ్యాచ్‌కు చెందిన కడియం గ్రామానికి చెందిన సాకుర్తి జాన్‌ నాలుగు నెలల క్రితం వీరవరంలో వెల్డింగ్‌ పనిచేస్తూ కరెంటు షాక్‌కు గురై మృతి చెందాడు. ఆయనకు భార్య, కుమార్తె ఉన్నారు. జాన్‌ మృతితో కుటుంబం వీధిన పడింది. విషయం తెలుసుకున్న అతని స్నేహితులు జాన్‌ కుటుంబానికి తమ వంతు సాయంగా రూ.75వేలు అందించారు. స్థానిక కడియం జిల్లా పరిషత్‌ పాఠశాలలో ఎంపిపి వెలుగుబంటి ప్రసాద్‌ చేతులమీదుగా ఆ కుటుంబానికి ఈ మొత్తాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షుడు వెలుగుబంటి నాని, తామెళ్ల అయ్యప్ప, తోట మణి, చిక్కాల శ్రీనివాస్‌, తదితరులున్నారు.