స్నేహితుని కుటుంబానికి ఆర్థిక సాయం అందిస్తున్న పూర్వ విద్యార్థులు
ప్రజాశక్తి-కడియం
కడియం ఉన్నత పాఠశాలలో 1986-87లో పదోతరగతి చదివిన పూర్వ విద్యార్థి బి.సత్యమూర్తి ఇటీవల మృతి చెందాడు. తనతో పాటు చదువుకున్న మిత్రులు ఈ విషయం తెలుసుకున్నారు. ఆ కుటుంబానికి తమ వంతు సాయం చేయాలని నిర్ణయించారు. దీనితో మిత్రుల సహకారంతో చదువుకున్న పాఠశాల ఆవరణలో ఆదివారం సత్యమూర్తి కుటుంబ సభ్యులకు రూ.25 వేల ఆర్థిక సాయం అందించారు. పూర్వ విద్యార్థులు సేవా గుణాన్ని సత్యమూర్తి కుటుంబ సభ్యులతో పాటు పలువురు అభినందించారు. ఈ కార్యక్రమంలో పూర్య విద్యార్థులు దిగ్గిరెడ్డి శ్రీనివాస్ , ఉంగరాల వీరభద్రరావు , జంగాల సత్యనారాయణ, చిక్కాల ఏడుకొండలు, పరిమి నరేష్, తదితరులు ఉన్నారు.










