ప్రజాశక్తి -గోకవరం గోకవరం గంగాలమ్మ గుడి సమీపంలోని దేవీపట్నం పునరావాస కాలనీ నిర్మాణ పనులను గురువారం ఆర్ అండ్ ఆర్ కమిషనర్ శ్రీధర్ పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేవీపట్నం పునరావాస కాలనీ గృహాల నిర్మాణంలో నాణ్యత లేదని సంబంధిత అధికారులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు కాంట్రాక్టర్లు కుమ్మక్కై నాణ్యత లేకుండా నిర్మాణాలు చేపడితే సహించేది లేదని హెచ్చరించారు. పునరావాస కాలనీలో నాణ్యతతో కూడిన పనులు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో రంపచోడవరం సబ్ కలెక్టర్ శుభం బన్సల్, పోలవరం అడ్మినిస్ట్రేటర్ ప్రవీణ్ ఆదిత్య తదితరులు పాల్గొన్నారు.










