ప్రజాశక్తి-పెరవలి : మండలం కానూరు గ్రామానికి చెందిన విద్యార్థుల తల్లిదండ్రులు రాజమహేంద్రవరం జిల్లా స్పందన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అధికారులకు వినతి పత్రం నిడదవోలు నియోజకవర్గం బీఎస్పీ కన్వీనర్ వెన్నపు సుధాకర్ ఆధ్వర్యంలో స్వయంగా అందజేశారు కానూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఫిజిక్స్ టీచర్ గా సి.హెచ్ .గంగరాజు తరగతులు 9' 10' ఇంటర్ విద్యార్థునుల కు విద్యా బోధన చేస్తాడు ఈయన గతంలో చాగల్లు బ్రాహ్మణగూడెం ఊనగట్ల పెండ్యాల ఉన్నత పాఠశాలల్లో పనిచేశాడు విద్యార్థునులను లైంగిక వేధింపులకు గురిచేస్తూ వ్యక్తిగత విషయాలు అడుగుతూ అసభ్యంగా ప్రవర్తించడంతో విద్యార్థునులు ప్రధానోపాధ్యాయురాలు దృష్టికి రాతపూర్వకంగా లేటరు తీసుకువెళ్ళటంతో మూడో తేదీ స్కూలుకు వచ్చిన మండల విద్యా శాఖ అధికారులు ఎదుట బీఎస్పీ నాయకులు తల్లిదండ్రులు ధర్నా చేయడంతో నిజ నిర్ధారణ కమిటీ పోలీస్ వారు విద్యార్థినులను విచారించగా ఆరోపణలు నిజమని తెలిసినది ఉపాధ్యాయుడు సి.హెచ్. గంగరాజు పై కేసు నమోదు చేశారు ఏడవ తేదీ కోర్టులో జడ్జి ముందు విద్యార్థులు వాంగ్మూలం ఇచ్చి ఉన్నారు. కొంతమంది రాజకీయ నాయకులు ఎటువంటి కేసు లేకుండా రాజీ చేయాలని ప్రయత్నిస్తున్నారు కేసులో విద్యార్థులు ఉంటే పెళ్లి సంబంధాలు ఉద్యోగాలు రావని రకరకాల ప్రలోభాలకు గురి చేస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఈ కార్యక్రమంలో నిడదవోలు నియోజకవర్గం బిఎస్పి కన్వీనర్ వెన్నపు సుధాకర్ ముసలి బంగారమ్మ భావన మంగమ్మ రొంపమంగా నందివర్ధన ముసలి గంగ భావన రాజ్యలక్ష్మి మేలిమి ధనలక్ష్మి పద్మ తదితరులు పాల్గొన్నారు.










