ప్రజాశక్తి - రాజమహేంద్రవరం
పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యతగా భావించి వినాయక చవితి సందర్భంగా మట్టి వినాయక ప్రతిమలతోనే పూజలు నిర్వహించుకోవాలని ఎంపి భరత్ పిలుపునిచ్చారు. నగరంలోని క్వారీ మార్కెట్ సెంటర్లో ఆదివారం వైసిపి నాయకులు అజ్జరపు వాసు ఆధ్వర్యంలో 1500 మట్టి వినాయక ప్రతిమలను ప్రజలకు ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపి మార్గాని భరత్ రామ్, అర్బన్ నియోజకవర్గం వైసిపి కోఆర్డినేటర్ డా.గూడూరి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపి భరత్ రామ్ మాట్లాడుతూ వినాయక చవితి సందర్భంగా మట్టి విగ్రహాలను మాత్రమే ఏర్పాటు చేసుకుని తమ భక్తిని చాటు కోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు గుర్రం గౌతం, నక్క శ్రీ నగేష్, అజ్జరపు ఫాలోవర్స్ అజ్జరపు రమేష్ బాబు, పేపర్ మిల్లు రమేష్, మణికంఠ రెడ్డి, రెబాక నాగేశ్వరరావు, కాలెపు దొరబాబు, అబ్బిరాజు, సుధాకర్, బంటి, లోకేష్, హరీష్, తదితరులు పాల్గొన్నారు. అలాగే పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి గణపతిని పూజిద్దాం, పర్యావరణాన్ని కాపాడదాం అనే నినాదంతో ఆర్తి స్వచ్ఛంద సేవా సంస్థ, సిసిసి ఛానల్ సంయుక్త ఆధ్వర్యంలో మట్టి వినాయక ప్రతిమలను ఉచితంగా పంపిణి చేశారు. ఆదివారం ఉదయం ఎ.వి.అప్పారావు రోడ్డులోని శ్యామలానగర్ శివా లయం సెంటర్లో సంస్థ అధ్యక్షుడు ఎస్.ఎన్.రాజా, పంతం కొండలరావు, బుడ్డిగ శ్రీనివాస్ తదితరుల చేతుల మీదుగా మట్టి వినాయక ప్రతిమలను ప్రజలకు ఉచితంగా అందచేశారు. ఈ కార్యక్రమంలో ప్రసాదుల హరినాధ్, కృష్ణ కుమార్, గొర్రెల సురేష్, కంచుమర్తి చంటి, అశోక్ కుమార్ జైన్, పాల్గొన్నారు.










