Mar 16,2023 23:32

ప్రజాశక్తి-రాజమహేంద్రవరం ప్రతినిధి ఇంటర్మీడియెట్‌ రెండవ సంవత్సరం పరీక్షలు గురువారం ప్రశాంతంగా జరిగాయి. తూర్పు గోదావరి జిల్లా పరిధిలోని రాజమండ్రి, కొవ్వూరు డివిజన్‌లో ఏర్పాటు చేసిన 47 పరీక్షా కేంద్రాల్లో తెలుగు/సంస్కతం, హిందీ/ ఉర్దూ ఇంటర్మీడియట్‌ పరీక్షలకు 14,796 మంది (98.71%) హాజరయ్యారు. ఒకేషనల్‌ పరీక్షలకు 1,593 మంది (94.14%) హజరయ్యారు. రాజమండ్రి డివిజన్‌లోని 32 కేంద్రాల్లో ఇంటర్‌ పరీక్షకు 10,893 మందికి 1,0758 మంది హాజరవ్వగా 135 మంది గైరాజరయ్యారు. కొవ్వూరు డివిజన్‌లోని 15 కేంద్రాల్లో ఇంటర్‌ తెలుగు పరీక్షకు 4,097 మందికి గాను 4,038 మంది హాజరవ్వగా, 59 మంది గైర్హాజరయ్యారు. ఒకేషనల్‌ పరీక్షలకు రాజమండ్రి డివిజన్‌లో తెలుగు పరీక్షకు 1,009 మందికి గాను 945 మంది హాజరవగా 64 మంది గైరాజరయ్యారు. కొవ్వూరు డివిజన్‌లో రెండవ సంవత్సరం పరీక్షకు 681 మందికి గాను 646 మంది హాజరవగా 35 మంది గైర్హాజరయ్యారు.
గోకవరం మండలంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఇంటర్మీడియట్‌ రెండవ సంవత్సరం పరీక్షల్లో మొత్తం 181 మంది విద్యార్థులకు గాను 176 మంది విద్యార్థులు హాజరు కాగా ఐదుగురు గైర్హాజరయ్యారని కళాశాల ప్రిన్సిపల్‌ శ్రీనివాసరావు థామస్‌ తెలిపారు తాళ్లపూడి మండలంలోని వేగేశ్వరపురం ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ పరీక్షలకు 11 మంది గైర్హాజరయ్యారని కళాశాల ప్రిన్సిపల్‌ పి.గౌరీనాథ్‌ తెలిపారు.