ప్రజాశక్తి - రాజమహేంద్రవరం
జిల్లాలో 2023-24 ఖరీఫ్ సీజన్లో రైతు పండించిన ప్రతి ధాన్యపు గింజను పారదర్శకంగా కొనుగోలు చేస్తామని జాయింట్ కలెక్టర్ ఎన్.తేజ్ భరత్ తెలిపారు. బుధవారం స్థానిక వెంకటేశ్వర ఆనం కళ ాకేంద్రంలో 2023-24 ఖరీఫ్ సీజన్లో ధాన్యం సేకరణపై రెవెన్యూ, పౌర సరఫరాల, సహకార, తూని కలు కొలతలు, రవాణా, ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, స్టేక్ హోల్డర్స్, కాస్టోడియన్ అధికారులకు ఒకరోజు శిక్షణా కార్యక్రమం జరిగింది. ధాన్యం సేకరణ అంశానికి సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ 2023-24 ఖరీఫ్‌లో 73, 216 హెక్టార్లలో రైతులు వరి పంట సాగు చేస్తున్నారని తెలిపారు. ఖరీఫ్ సీజన్లో రైతు పండించిన ప్రతి ధాన్యపు గింజను కొనుగోలు చేస్తామన్నారు. ఈ ఖరీఫ్ సీజన్లో 4 లక్షల 40 వేలు మెట్రిక్ టన్నుల వరకూ ధాన్యాన్ని సేకరించేందుకు ముం దస్తు కార్యాచరణ ప్రణాళికలు సిద్దం చేస్తున్నామన్నారు. ఆ మేరకు స్థానిక అవసరాలకు 23,825 మెట్రిక్ టన్నుల వినియోగం అవుతుందని అన్నారు. నేరుగా మిల్లర్లు కొనుగోలు చేసేవి 11,982 మెట్రిక్ టన్నుల ఉంటుందని, మిగిలినది సిఎమ్‌ఆర్ కింద పౌరసరఫరాల సంస్థ ద్వారా కొనుగోలు చేస్తామని తెలిపారు. జిల్లాలో ధాన్యం కొనుగోలుకు అవసరమయ్యే కోటి 11 లక్షల గన్నీ బ్యాగ్స్ సేకరించి ఆయా ఆర్‌బికెల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలకు ముందస్తుగా అందిం చనున్నటు తెలిపారు. జిల్లాలో ప్రధానంగా నాలుగైదు రకాలు ధాన్యం దిగుబడి వస్తుందని వాటిలో ఎంటియు 1064 ఇంద్రా రకం 80,367 ఎంటి, ఎంటియు 7029 (స్వర్ణ) రకం 1,73,061 ఎంటి, పిఎల్‌ఎ 1100 రకం 1,06,128 ఎంటి, సంపద స్వర్ణ 44,382 ఎంటి ఉన్నా యన్నారు. రైతు పండించిన ధాన్యాన్ని మిల్లులకు తీసు కొచ్చినప్పుడు తేమ శాతం 17 కంటే మించి ఉండకుండా జాగ్రత్త వహించాలన్నారు. రైతునుంచి ధాన్యం సేకరిం చిన ధాన్యంకు సొమ్ము 21 రోజుల వ్యవధిలో వారి బ్యాం కు అకౌంట్లోకి జమ చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్‌డిఒ ఎ.చైత్ర వర్షిణి, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు.










