Jun 19,2023 00:15

రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో వక్తలు
ప్రజాశక్తి-రాజుమహేంద్రవరం
రాష్ట్ర ప్రభుత్వం ప్రజలపై మోపుతున్న విద్యుత్‌ భారాలను ఉపసంహరించాలని ఆదివారం జరిగిన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో వక్తలు డిమాండ్‌చేశారు. విద్యుత్‌ ఛార్జీల పెంపు, సర్దుబాటు ఛార్జీలు, ప్రీపెయిడ్‌ స్మార్ట్‌ మీటర్లకు వ్యతిరేకంగా సిపిఎం, సిపిఐ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం స్థానిక వై.జంక్షన్‌ వద్ద ఉన్న ఆనం రోటరీ హాలు నందు రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించారు. ఈ రౌండ్‌ టేబుల్‌ సమావే శానికి టిడిపి రాజమహేంద్రవరం రూరల్‌ ఎంఎల్‌ఎ గోరంట్ల బుచ్చయ్య బౌదరి, టిడిపి నాయకులు ఆదిరెడ్డి.అప్పారావు, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు బి.మురళిధర్‌, ఎపి పౌర హక్కు ల సంఘం రాష్ట్ర అధ్యక్షులు, న్యాయవాది ముప్పాళ్ల సుబ్బారావు, సిపిఐ న్యూ డెమోక్రసీ నాయకులు కె.జోజి హాజరై మాట్లాడారు. సమావేశానికి సిపిఎం జిల్లా కార్యదర్శి టి.అరుణ్‌ సిపిఐ జిల్లా కార్యదర్శి టి.మధు అధ్యక్షత వహించారు. వక్తలు మాట్లాడుతూ విద్యుత చార్జీలు పెంచనని అని వైసిపి హామీ ఇచ్చి ఆపార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ఏడు సార్లు విద్యుత్‌ ఛార్జీల భారాన్ని పెంచినదని విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న విధానాల వల్ల ప్రజలకు కరెంట్‌ బిల్లు చుడగానే షాక్‌ కొట్టింది అని అన్నారు. ఇప్పటికే శ్లాబులు మార్చి భారం మోపారన్నారు. ఈ మే నెల బిల్లుల్లో 2014లో వాడుకున్న కరెంటుకు మళ్లీ యూనిట్‌ కు రూ.20పైసలు, 2021 మేలో వాడిన విద్యుత్తు యూనిట్‌ కు మరో రూ.20 పైసలు, 2023 ఏప్రిల్‌ లో ఉపయోగించిన కరెంట్‌ యూని ట్‌కు రూ.40 పైసలు కలిపి మొత్తం రూ.80 పైసలు చొప్పున జనం నెత్తిన వైసిపి ప్రభుత్వం భారం మోపిందని విమర్శించారు. ప్రపంచం లో కరెంటు చార్జీలు తగ్గుతున్నాయని, కానీ దేశంలో, రాష్ట్రంలో కరెంటు చార్జీలు తగ్గించా ల్సింది పోయి పెంచుతున్నారని తెలిపారు. దీనికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలే కారణమన్నారు. మన రాష్ట్రంలో 30 సంవత్స రాలపాటు వ్యవసాయానికి విద్యుత్‌ మొత్తం తయారు చేసే ఒప్పందం అదానికే ఇచ్చారని అన్నారు. విదేశాలనుండి బొగ్గు సరఫరా చేసేది, బొగ్గు రవణా చేసే ఓడరేవులు, తాజాగా స్మార్ట్‌ మీటర్లు తయారు చేసే కంపెనీ అదానికి, కార్పొరేట్లకు లాభాలు కట్టబెట్టడం ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ జేబులు నింపుకుంటున్నాయన్నారు.
తీర్మానాలు..
1. ప్రజలపై విద్యుత్‌ఛార్జిల భారం, సర్దుబాటు చార్జీలు, ట్రూఅప్‌ఛార్జీ భారాలను ఉపసంహ రించాలని డిమాండ్‌ 2. ప్రి పెయిడ్‌ స్మార్ట్‌ మీటర్లు పెట్టే నిర్ణయాన్ని ఉపసంహరించాలి. పై రెండు తీర్మానాలను రౌండ్‌ టేబుల్‌ సమా వేశంలో ఏకగ్రీవంగా చేశారు. సమావేశంలో సిపిఎం నగర కార్యదర్శి బి.పవన్‌, నాయకులు ఎస్‌ఎస్‌.మూర్తి, బి.పూర్ణిమరాజు, కెవిపిఎస్‌ జిల్లా కార్యదర్శి జె.రాంబాబు, సిపిఐ నగర కార్యదర్శి వి.కొండలరావు, నాయకులు రాంబాబు, నల్లా.రామారావు, ఎమ్‌.విజయ లక్ష్మి, నిర్మల, ఎఐటియుసి నాయకులు రామకృష్ణ, రిటైర్డ్‌ ఉపాధ్యాయులు పి.మురళి కృష్ణ, జన విజ్ఞాన వేదిక సభ్యులు డా.చైతన్య శేఖర్‌, డి.జి.ప్రసాద్‌, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్య క్షులు వి.రాంబాబు, జిల్లా కార్యదర్శి ఎన్‌.రాజా, ఐద్వా నాయకులు బి.సుధ మరియు వివిధ రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాల నాయ కులు, మేధావులు, ప్రముఖులు పాల్గొన్నారు.