ప్రజాశక్తి-కొవ్వూరు రూరల్
ప్రజాసంక్షేమమే వైసిపి ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర హోం మంత్రి, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత అన్నారు. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు టౌన్ లోని శ్రీరామా ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం లిమిటెడ్ చైర్మన్, డైరెక్టర్ల ప్రమాణ స్వీకారానికి మంత్రి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. శనివారం శ్రీరామ సొసైటీ ఆవరణలో జరిగిన ఈ కార్యక్రమంలో చైర్మన్‌గా డాక్టర్ అక్షయపాత్ర శ్రీనివాస రవీంద్ర, డైరెక్టర్లుగా బోడపాటి హనుమంతరావు, గోసాల శ్రీనివాసరావుల చేత రాజమహేంద్రవరం ఎంపీ మార్గాన్ని భరత్ రామ్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా హోం మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ... రాష్ట్రవ్యాప్తంగా సొసైటీలలో నామినేటెడ్ పోస్టుల కింద చైర్మన్లు డైరెక్టర్లను నియమించడానికి అవకాశం కల్పించిన సిఎం జగన్‌కు కతజ్ఞతలు తెలిపారు. ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని ఎదుర్కోలేక రాజకీయ విమర్శలకు దిగుతున్నారని, వాటిని ధైర్యంగా తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. ఎంపీ భరత్ రామ్ మాట్లాడుతూ.. దేశంలో గుజరాత్ రాష్ట్రం తర్వాత కేంద్రం నుండి అన్ని ఎక్కువ నిధులు అంధ్రప్రదేశ్ కు మాత్రమే వచ్చాయన్నారు. కొవ్వూరు నియోజకవర్గం వివిధ రోడ్లు నేషనల్ హైవేలతో మంత్రి తానేటి వనిత రూపురేఖలు మార్చారని తెలిపారు. మాజీ ఎంఎల్‌ఎ రౌతు సూర్యప్రకాశరావు మాట్లాడుతూ రాష్ట్రంలో 175 ఎంఎల్‌ఎలు ఒక ఎతైతే కొవ్వూరు ఎంఎల్‌ఎ తానేటి వనితకు హోం మంత్రిగా ప్రత్యేక గుర్తింపు ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.
సొసైటీల అభివృద్ధికి పాలక వర్గాలు కృషి చేయాలి
చాగల్లు : సొసైటీ అభివద్ధికి పాలకవర్గాలు కృషి చేయాలని రాష్ట్ర హోం మంత్రి తానేటి వనిత అన్నారు. మార్కొండపాడు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం సొసైటీ నూతన అధ్యక్షునిగా గంగిశెట్టి వీర వెంకట రమణమూర్తి, సభ్యులు తాడేపల్లి శ్రీనివాసు, అంబటి మురళీమోహన్‌లతొ సొసైటీ కార్యదర్శి పి.వరలక్ష్మి శనివారం ప్రమాణ స్వీకారం చేయించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న రాష్ట్ర హోం మంత్రి తానేటి వనిత పాల్గొన్నారు. నూతన అధ్యక్షుడు రమణమూర్తి మాట్లాడుతూ బోర్డు సభ్యులతో అధికారుల కలిసి సొసైటీ అభివద్ధికి కషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి మట్టా వీరస్వామి, గ్రామ సర్పంచ్ కె. లక్ష్మీశివపోశి, ఉనగట్ల సొసైటీ అధ్యక్షులు ఆత్కూరి దోరయ్య, మండల వైసిపి అధ్యక్షులు చెల్లింకుల దుర్గా మల్లేశ్వరరావు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.










