ప్రజాశక్తి - నిడదవోలు
ప్రజా సమస్యలను పరిష్కరించడమే ప్రభుత్వం లక్ష్యంగా ముందుకు సాగుతుందని జాయింట్ కలెక్టర్ ఎన్.తేజ్ భరత్ అన్నారు. బుధవారం స్థానిక కొత్తపల్లి శ్రీ రాములు కనకమ్మ లయిన్స్ క్లబ్ ఆడిటో రియంలో నిర్వహించిన మండలస్థాయి జెకెసి కార్య క్రమంలో జెసితోపాటు, ఎంఎల్‌ఎ జి.శ్రీనివాస నాయు డు, సహాయ కలెక్టర్ సి. యశ్వంత్ కుమార్, డిఆర్‌ఒ జి.నరసింహులు, ఆర్‌డిఒ ఎస్. మల్లిబాబు ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ తేజ్ భరత్ మాట్లాడుతూ పంచాయితీ, వైద్య ఆరోగ్య, మున్సిపల్ అడ్మిష్ట్రేషన్, రెవెన్యూ, భూ సంబంధ, హౌసింగ్, తదితర శాఖల కు చెందిన మండల స్థాయి స్పందనలో 152 అర్జీలను స్వీకరించామని తెలిపారు ఇందులో నిడదవోలు రూరల్ పరిధిలోనికి 70 కాగా, అర్బన్ పరిధిలోనికి 82 అర్జీలు ఉన్నాయన్నారు. ప్రతి బుధవారం మండల స్థాయిలో జెకెసి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ప్రతి ఒక్క అర్హత కలిగిన అర్జీలను వారం రోజుల లోగా పరిష్కారం చూపడం జరుగుతుందని అన్నారు. ఆమేరకు ఆయా శాఖల జిల్లా అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ఎంఎల్‌ఎ శ్రీనివాస నాయుడు మాట్లాడుతూ సిఎం జగన్ ప్రజా సమస్యల పరిష్కారం కోసం చిత్తశుద్దితో పని చేయాలనే లక్ష్యం దిశగా అడుగులు వేయాలన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖ జిల్లా అధికారులు పి.జగ దంబ, ఎస్‌జిటి సత్య గోవింద్, ఎ.ముఖ లింగం, ఎన్‌వి. సత్యనారాయణ, కె. విజయ కుమారి, జి.పరశురామ్, జిల్లా, మండల, డివిజన్ స్థాయి అధికారులు పాల్గొన్నారు.










