Jul 20,2023 00:02

ప్రజాశక్తి-గోపాలపురం
ప్రజా సమస్యల పరిష్కారానికే ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని జిల్లా డా.కె.కలెక్టర్‌ మాధవీలత అన్నారు. బుధవారం గోపాలపురం గ్రామంలో స్థానిక ఎఎమ్‌ సి కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన జగనన్న సురక్ష కార్యక్రమానికి ఎంఎల్‌సి తలారి వెంకట్రా వుతో కలిసి కలెక్టర్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా కలెక్టర్‌ మాధవీలత మాట్లాడుతూ ఐదున్నర లక్షల కుటుంబాలకు కలెక్టర్‌ గా ఉన్నానని, ప్రతి 50 కుటుంబాలకు వాలంటీర్లే కలెక్టర్లు అని ఆమె అన్నారు. అంతే ఇదిగా ప్రభుత్వ సేవలను మీకు అప్పగించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలను చేపట్టడం జరుగు తోందని అన్నారు. అర్హత ఉన్న లబ్దిదా రులకు పథకాలు అమలు కాకుండా ఉంటే వారిని గుర్తించి ఆమేరకు సంక్షేమ పథకాలను అమలు చేయడం, ధృవ పత్రాలు అందచేసే కార్యక్రమం జగనన్న సురక్ష లో భాగంగా చేపట్టడం జరిగిందన్నారు. ఈ గ్రామ సభలో 1296 మంది అర్హులకు ధ్రువపత్రాలు అంద చేశామని పేర్కొన్నారు. అనంతరం ఎంఎల్‌ఎ తలారి వెంకట్రావు మాట్లా డుతూ నేడు వాలంటీర్‌ వ్యవస్థ ద్వారా నేరుగా ప్రజలకు ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలు చేయడం సాధ్యం అయిందని పేర్కొన్నారు. అనంతరం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలను కలెక్టర్‌, ఎంఎల్‌ఎ సందర్శించారు. విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడారు భోజనం వసతులపై ,పథకాలపై ఆరా తీశారు. కార్యక్రమంలో ఆర్‌డిఒ ఎస్‌.మల్లి బాబు, డిఇఒ ఎస్‌.అబ్రహం, స్పెషల్‌ ఆఫీసర్‌ సత్య గోవింద్‌, జెడ్‌పిటిసి సభ్యురాలు కె.లలిత, ఎంపిపి ఉండవల్లి సత్యనారాయణ, సర్పంచ్‌ పైడి శిరీష, అతిరాస కార్పొరేషన్‌ చైర్మన్‌ ఇళ్ళ భాస్కర్‌ రావు, ఎఎంసి చైర్మన్‌ జిజనార్ధన్‌, తహశీల్దార్‌ రవీంద్ర, ఎంపిడివో ఆర్‌. శ్రీదేవి, తదితరులు పాల్గొన్నారు.