Jul 19,2023 00:23


ఎస్‌ఎఫ్‌ఐ డిమాండ్‌
ప్రజాశక్తి-నిడదవోలు
నిడదవోలు ప్రభుత్వ జూనియర్‌ కళాశాల్లో చదివే విద్యార్థులకు ప్రభుత్వమే పాఠ్య పుస్తకాలు ఇవ్వాలని ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో స్థానిక నిడదవోలు తహశీల్దార్‌ కార్యాలయం వద్ద విద్యార్థులు ధర్నా చేసి నిరసన తెలియ జేశారు. ఎస్‌ఎఫ్‌ఐ నిడదవోలు నాయకులు నాని మాట్లా డుతూ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ జూనియర్‌ కళాశాలన్నిటికీ రాష్ట్ర ప్రభుత్వమే పాఠ్యపుస్తకాలను అందించాలని అయితే ఈ సంవత్సరం విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పాఠ్యపుస్తకాలు ప్రభుత్వం ఇవ్వటం లేదని విద్యార్థులే బయట కొనుగోలు చేసుకోవాలని ఒక ప్రకటన ద్వారా తెలియజేశారన్నారు. ఇంటర్మీడియట్‌ బోర్డు ఒక సర్కిలర్‌ ద్వారా విడుదల చేసిందని తెలిపారు. ఇది రాష్ట్ర ప్రభుత్వం సిగ్గుపడాల్సిన విషయం అని రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదువుతున్న విద్యార్థులకు పుస్తకాలు ఇవ్వ లేని ప్రభుత్వం విద్యాభివృద్ధికి ఏ రకంగా కృషి చేస్తుం దని ప్రశ్నించారు. వెంటనే ప్రభుత్వం వారి నిర్ణయాన్ని మార్చు కోవాలని లేని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో చదివే విద్యార్థులు అందరితో ఆందోళన చేస్తామన్నాయ. అనంతరం వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో కిరణ్‌, సన్నీ తదితరులు పాల్గొన్నారు.