ప్రజాశక్తి- గోపాలపురం దేశానికి రైతే రాజు అని, ప్రభుత్వాలు రైతుల కష్టాలలను గుర్తించాలని ఎంపిపి ఉండవల్లి సత్యనారాయణ అన్నారు. శనివారం స్థానిక శార్వాణి హైస్కూల్లో జాతీయ ఉత్తమ రైతు అవార్డుగ్రహీత ముప్పన రమణారెడ్డి అభినందన సత్కార సభ మాకిరెడ్డి వరప్రసాద్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపిపి ఉండవల్లి మాట్లాడుతూ జాతీయ స్థాయిలో అవార్డు పొందిన రమణరెడ్డి కృషి వెనుక కఠోర దీక్ష పట్టుదల ఉందని గుర్తు చేశారు. దేశంలో జీడీమామిడి సరాసరి దిగుబడి 8 క్వింటాళ్లు మాత్రమేనని రమణారెడ్డీ సేంద్రీయ వ్యవసాయం ద్వారా సుమారు హెక్టార్‌కు 16 క్వింటాళ్లు దిగుబడి సాదించారని తెలిపారు. అనంతరం ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిపి నున్నా మోహన్‌రావు, మాజీ జెడ్‌పిటిసి ఉండవల్లి సుభాష్ చంద్రబోష్, డాక్టర్ ఎం.రాజేశ్వర్ రెడ్డి ప్రసంగించారు. అనంతరం రమణా రెడ్డిని రైతులు, పలువురు నాయకులు, శార్వాణి స్కూల్ యాజమాన్యం ఘనంగా సన్మానించారు.










