Feb 20,2023 23:06

ప్రజాశక్తి-రాజమహంద్రవరం పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తే రాష్ట్ర సమగ్రాభివృద్ధి సాధ్యమని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ అన్నారు. పోలవరం ప్రాజెక్టు పరిశీలనకు రాజమహేంద్రవరం నుంచి పార్టీ రాష్ట్ర బందం సోమవారం బయల్దేరింది. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తయ్యే వరకు సిపిఐ విశ్రమించదన్నారు. బిజెపి రాష్ట్ర నేతలకు సిగ్గు ఉంటే పోలవరం నిధులపై కోసం ఉద్యమించాలన్నారు. రూ.2,900 కోట్ల నిధులు మంజూరు చేయకపోతే బిజెపి చరిత్ర హీనురాలిగా మిగిపోతుందన్నారు. రైతు సంఘం జాతీయ అధ్యక్షులు రావుల వెంకయ్య మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు కోసం త్యాగం చేసిన నిర్వాసితులను గాలికి వదిలేస్తారా అని ప్రశ్నించారు. ఈ కార్యక్రంలో సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జెవి.సత్యనారాయణ మూర్తి, పార్టీ అగ్ర నాయకులు అక్కినేని వనజ, జి.ఓబులేసు, జల్లి విల్సన్‌, జి.ఈశ్వరయ్య, డి.జగదీష్‌, కెవివి.ప్రసాద్‌, కామేశ్వరావు, డేగ ప్రభాకర్‌, దుర్గాభవాని, విమల, సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు, కృష్ణ చైతన్య, చలసాని రామారావు, బి.కొండలరావు, బండి వెంకటేశ్వరావు, జమలయ్య, కుండ్రపు రాంబాబు, వి.కొండలరావు పాల్గొన్నారు.