సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు అక్కినేని వనజ
ప్రజాశక్తి - రాజమహేంద్రవరం
పోలవరం ప్రాజెక్టుకు రావాల్సిన నిధులు, నిర్వాసితుల సమస్యలపై పోలవరం నుంచి అమరావతికి జీపు యాత్ర నిర్వహించనున్నట్టు సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు అక్కినేని వనజ పిలుపునిచ్చారు. మంగళవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆమె మాట్లాడారు. రాష్టానికి అన్యాయం చేస్తున్న మొదటి ముద్దాయి మోడీ అని, రెండవ ద్రోహి జగన్ అని అన్నారు. తన రాజకీయ అవసరాల కోసమే జగన్ పలుమార్లు ఢిల్లీకి వెళ్తున్నారన్నారు. పోలవరానికి నిధులు ఇవ్వకుండా మోడీ అడ్డుపడుతున్నారన్నారు. అడిగే ధైర్యం జగన్‌కు లేదన్నారు. అందుకనే నిధులు, నిర్వాసితుల సమస్యలపై జీపు యాత్ర తలపెట్టామన్నారు. జూన్ రెండవ వారంలో పోలవరంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామన్నారు. నూతన పార్లమెంట్ ప్రారంభం త్సవంలో రాజ్యాంగానికి మోడీ తూట్లు పొడిచారన్నారు. రాష్ట్రపతిని ఆహ్వానించకపోవడం దారుణమన్నారు లౌకిక వ్యవస్థను నాశనం చేసే విధంగా మఠాధిపతులను అహ్వానించడం మోడీ మతోన్మాద విధానాలకు నిదర్శనమన్నారు. ఈ సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు, జిల్లా సహాయ కార్యదర్శి కె.రాంబాబు, నగర కార్యదర్శి వి.కొండలరావు తదితరులు పాల్గొన్నారు.










