Mar 01,2023 22:09

ప్రజాశక్తి-గోపాలపురం పొగాకు సాగులో క్రిమి సంహారక రసాయనక ఎరువులు కాకుండా ప్రకృతి వ్యవసాయ పద్ధతుల ద్వారా పండించాలని రాజమహేంద్రవరం ఆర్‌ఎం జిఎల్‌కె.ప్రసాద్‌, ఐటిసి మేనేజర్‌ యశ్వంత్‌ రైతులకు సూచించారు. బుధవారం మండలంలోని చెరుకుమిల్లిలో దేవరపల్లి పొగాకు బోర్డు రైతులకు పొగాకు పంట సాగుపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పొగాకు పంట సాగులో క్రిమి సంహరక రసాయనక ఎరువులు తగ్గించాలన్నారు. ప్రకృతి పరమైన ఆర్గానిక్‌ ఎరువులు, సాధారణ వ్యవసాయ పద్ధతుల ద్వారా వ్యవసాయం సాగు చేయాలని అన్నారు. పక్వానికి వచ్చిన ఆకు మాత్రమే ఆకు రెలుపు చేయాలని సూచించారు. పొగాకు రేంజింగ్‌ సమయంలో తగిన జాగ్రత్తలు పాటించాలని అన్నారు. పొగాకు గ్రేడింగ్‌ సమయంలో అన్ని పదార్థాలు కలవకుండా చూడాలని నాణ్యమైన పొగాకు అంతర్జాతీయ మార్కెట్లో మంచి గిరాకీ ఉందని తెలిపారు. బోర్డు అధికారులు సూచనల మేరకు మాత్రమే మందులు ఉపయోగించి అధిక దిగుబడి సాధించాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌జిఒ శివకుమార్‌ రైతుల తదితరులు పాల్గొన్నారు. అనంతరం పొగాకు పంటలను వారు పరిశీలించి రైతులకు పలు సూచనలు తెలిపారు.