Aug 15,2023 23:40

ప్రజాశక్తి - యంత్రాంగం
జిల్లాలో స్వాతంత్య్ర దినోత్సవాన్ని పండుగలా నిర్వహించారు. అన్ని ప్రభుత్వ, ప్రయివేటు కార్యాలయాలు, విద్యాసంస్థల్లో జాతీయ పతాకాలను ఎగురవేశారు. రాజమహేంద్రవరంలో నిర్వహించిన కార్యక్రమానికి జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఆర్ట్స్‌ కళాశాలలో నిర్వహించిన కార్యక్రమాలు ఆద్యంతం ఆకట్టుకున్నాయి.
      రాజమహేంద్రవరం :ప్రతి ఒక్కరూ దేశభక్తి చాటేలా స్వాతంత్య్ర స్ఫూర్తి పొందేలా విధుల్లో పునరంకితం కావాలని కలెక్టర్‌ డాక్టర్‌ కె.మాధవీలత పిలుపునిచ్చారు. కలెక్టరేట్‌ ఆవరణలో ఆమె జాతీయ జెండాను ఆవిష్కరించారు. పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ వేడుకల్లో జెసి ఎన్‌.తేజ్‌ భరత్‌, సహాయ కలెక్టర్‌ సి.యశ్వంత్‌కుమార్‌, డిఆర్‌ఒ జి.నరసింహులు,ఇతర అధికారులు పాల్గొన్నారు.
కోర్టు ఆవరణలో...
కోర్టు ఆవరణలో జాతీ పతాకాన్ని జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత ఆవిష్కరించారు. ఆమె మాట్లాడుతూ జాతీయ నాయకుల స్ఫూర్తిని చిన్ననాటి నుంచే పిల్లలకు తెలియజేయాలన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులు నిర్వహించిన వివధ పోటీల్లో విజేతలకు బహుమతులు అందించారు. పలువురు న్యాయ మూర్తులు , న్యాయ వాదులు తదితరులు పాల్గొన్నారు.
కార్పొరేషన్‌ కార్యాలయంలో...
రాజమహేంద్రవరం కార్పొరేషన కార్యాలయంలో నిర్వహించిన కార్యాక్రమంలో కమిషనర్‌ దినేష్‌కుమార్‌, రుడా చైర్మన్‌ షరిళారెడ్డి పాల్గొన్నారు. కమిషనర్‌ మాట్లాడుతూ నగరాభివద్ధిలోను, సంక్షేమ పథకాలు అమల్లో అధికారులు, సిబ్బంది భాగస్వాములు కావాలన్నారు. షర్మిలారెడ్డి మాట్లాడుతూ స్వాతంత్య్రాన్ని సక్రమంగా వినియోగించు కోవాలన్నారు. ఉత్తమ పురస్కారాలు అందుకున్న సిబ్బందిని అభినందించారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్‌ పిఎం.సత్యవేణి, డిప్యూటీ కమిషనర్‌ జి.సాంబశివరావు, సిటీ ప్లానర్‌ వైబిఆర్‌.చంద్రబోస్‌, ఎస్‌ఇ జి.పాండు రంగారావు, మున్సిపల్‌ హెల్త్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ ఎ.వినూత్న తదితరులు పాల్గొన్నారు.
ప్రజాశక్తి ఎడిషన్‌ కార్యాలయంలో...
రాజమహేంద్రవరంలోని ప్రజాశక్తి ఎడిషన్‌ కార్యాలయంలో ఎడిషన్‌ మేనేజర్‌ డి.శ్రీనివాస్‌ అధ్వర్యంలో స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథులుగా సిపిఎం సీనియర్‌ నాయకులు టిఎస్‌.ప్రకాష్‌, ఐద్వా సీనియర్‌ నాయకులు టి.సావిత్రి ముఖ్యఅతిథులగా హాజరయ్యారు. సావిత్రి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. వారు మాట్లాడుతూ త్యాగధనుల వల్ల స్వాతంత్య్రం సిద్ధించిందన్నారు. కాని నేటికీ దేశంలో చాలా మందికి స్వాంత్య్ర ఫలాలు దక్కట్లేదన్నారు. ప్రభుత్వ రంగాన్ని కేంద్రంలో మోడీ ప్రభుత్వం నిర్వీర్యంచేస్తుందన్నారు. స్వాతంత్య్ర సమరయోధుల స్ఫూర్తితో మోడీ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాశక్తి సిబ్బంది పాల్గొన్నారు.
ఎస్‌కెఆర్‌ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపల్‌ డాక్టర్‌ పి.రాఘవకుమారి స్వాతంత్య్ర దినోత్సవాన్ని నిర్వహించారు. కళాశాల వైస్‌ ప్రిన్సిపల్‌ ఎస్‌ఆర్‌.రత్నకుమార్‌ ముఖ్యఅతిథిగా, విశిష్ట అతిథిగా ఎక్స్‌ కార్పొరేటర్‌ బొంత శ్రీహరి పాల్గొన్నారు. రాజమహేంద్రవరం రూరల్‌ ధవళేశ్వరంలోని హార్లిక్స్‌ ఫ్యాక్టరీ ఇంజినీరింగ్‌ మేనేజర్‌ శ్రీధర్‌బాబు జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి హెచ్‌ఆర్‌ మేనేజర్‌ ఎస్‌.శ్రీనివాసరావు, సిఐటియు నాయకులు ఎస్‌ఎస్‌.మూర్తి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ప్రొడక్షన్‌ మేనేజర్‌ ఎంఎస్‌కె.ప్రసాద్‌, కెఎస్‌వి.రామచంద్రరావు, కె.రామకృష్ణ పాల్గొన్నారు. పెరవలి మండల పరిషత్‌ కార్యాలయంలో ఎంపిపి కార్చెర్ల సీతారాంప్రసాద్‌ జాతీయ పతకాన్ని ఎగురవేశారు. తహశీల్దార్‌ కార్యాలయం వద్ద తహశీల్దార్‌ టి.రాజేశ్వరి, పోలీస్‌స్టేషన్‌ వద్ద ఎస్‌ఐ ఎం.సూర్యభగవాన్‌ జాతీయ పతకాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఒ డి.దామోదర్‌రావు, సిడిపిఒ శ్రీలక్ష్మి, ఎంపిటిసి సభ్యులు రాపాక ప్రమీలరాణి, సూపరింటెండెంట్‌ సింగంశెట్టి రమేష్‌, ఆర్‌ఐ పావని కోన వెంకటవేణు తదితరులు పాల్గొన్నారు. ముక్కామల ప్రాథమిక ఉన్నత పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో వైసిపి నాయకులు వీరమల్ల శ్రీను మాట్లాడారు. సర్పంచ్‌ కేతా త్రిమూర్తులు, వైస్‌ ఎంపిపి వేండ్ర శ్రీను, సొసైటీ అధ్యక్షులు రేలంగి ఏసు, ఎంపిటిసి సభ్యులు గండేపల్లి రామకృష్ణ, వైస్‌ సర్పంచ్‌ కాలదాసి వీరేశం పాల్గొన్నారు. చాగల్లు మండల పరిషత్‌ కార్యాలయంలో ఎంపిపి మట్టా వీరస్వామి, తహశీల్దార్‌ కార్యాలయం వద్ద తహశీల్దార్‌, పోలీస్‌స్టేషన్‌ వద్ద ఎస్‌ఐ సిహెచ్‌వి.రమేష్‌ జాతీయ పతాకాలు ఆవిష్కరించారు. నల్లజర్లలో భాష్యం పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో సిఐ నున్నా రాజు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. విద్యార్థుల సాంస్కతిక ప్రదర్శనలు అలరించాయి. భాష్యం విద్యా సంస్థల జోనల్‌ విద్యాధికారి జిఎన్‌. సత్యనారాయణ, ప్రిన్సిపల్‌ జివై.రాజు, చాంప్స్‌ ఇన్‌ఛార్జి కె.శ్రీలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. గోకవరం మండల పరిషత్‌ కార్యాలయంలో ఎంపిపి సుంకర శ్రీవల్లి జాతీయ జెండాను ఎగురవేశారు. తహశీల్దార్‌ కార్యాలయం వద్ద తహశీల్దార్‌ డి.సుగుణ, పోలీస్‌స్టేషన్‌ వద్ద ఎస్‌ఐ శివనాగబాబు, సచివాలయాల వద్ద సర్పంచులు జెండాలు ఆవిష్కరించారు. నిడదవోలు మున్సిపల్‌ కార్యాలయంలో ఎంఎల్‌ఎ జి.శ్రీనివాస్‌నాయుడు, మున్సిపల్‌ చైర్మన్‌ భూపతి ఆదినారాయణ, వైస్‌ చైర్మన్లు యలగడ బాలరాజు, గంగుల వెంకటలక్ష్మి కౌన్సిలర్లు పాల్గొన్నారు. కాంగ్రెస్‌ కార్యాలయంలో ఆ పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి పెద్దిరెడ్డి సుబ్బారావు ఆధ్వర్యంలో పట్టణ అధ్యక్షులు కారింకి వెంకటేశ్వర రావు అధ్యక్షతన స్వాతంత్య్ర దినోత్సవాన్ని నిర్వహించారు. సిఐటియు ఆధ్వర్యంలో నిడదవోలు గ్యాస్‌ కార్మికులు స్వాతంత్య్ర దినోత్సవాన్ని నిర్వహించారు. నాయకులు జువ్వల రాంబాబు జాతీయ పతాకాన్ని ఎగురువేశారు. కడియం సర్‌ ఆర్థర్‌ కాటన్‌ నర్సరీ ఫార్మర్స్‌ అసోసియేషన్‌ కార్యాలయంలో అధ్యక్షులు మల్లు పోలరాజు, మండల పరిషత్‌ కార్యాలయంలో ఎంపిపి వెలుగుబంటి ప్రసాద్‌, కడియం మసీదులో జిల్లా నూర్‌ బాషా సంఘం అధ్యక్షులు షేక్‌ సలీం, కడియం సొసైటీలో ఛైర్మన్‌ గిరజాలబాబు, పంచాయతీల వద్ద సర్పంచులు జాతీయ పతాకాలను ఆవిష్కరించారు. ఎంపిడిఒ కె.రత్నకుమారి, వైస్‌ ఎంపిపి పంతం గణపతి, ఇఒపిఆర్‌డి లక్ష్మి, మండల పరిషత్‌ ఎఒ చంద్రరావు పాల్గొన్నారు. ఉండ్రాజవరం మండల పరిషత్‌ కార్యాలయం వద్ద ఎంపిపి పాలాటి యల్లారీశ్వరి మొక్కలు నాటారు. మోర్త జడ్‌పిహెచ్‌ పాఠశాలలో పదోతరగతిలో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన విద్యార్థులకు పిఎసిఎస్‌ త్రిసభ్య కమిటీ అధ్యక్షులు ఆలపాటి నరేంద్ర ప్రసాద్‌ జ్ఞాపికలు, నగదు బహుమతులు అందించారు. మండల కో ఆప్షన్‌ సభ్యులు షాజహాన్‌, పాలాటి శరత్‌, అధికారులు పాల్గొన్నారు. సీతానగరం మండలంలో అన్ని ప్రభుత్వ, ప్రయివేటు కార్యాలయాలు, విద్యాసంస్థల్లో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి బొడ్డు వెంకటరమణచౌదరి కస్తూర్బా గాంధీ ఆశ్రమాన్ని సందర్శించి శుభాకాంక్షలు తెలిపారు. టిడిపి సీనియర్‌ నాయకులు పెందుర్తి అచ్చయ్య ఆధ్వర్యంలో జెండా ఎగురవేశారు. ఆశ్రమ ప్రతినిధి జి.సుశీల, మాజీ ఎంపిపి పెందుర్తి దేవదాసు తదితరులు పాల్గొన్నారు. దేవరపల్లి : ఎంఎల్‌ఎ క్యాంపు కార్యాలయం వద్ద ఎంఎల్‌ఎ తలారి వెంకట్రావు జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, సచివాలయం ఉద్యోగులు, విద్యార్థులు పాల్గొన్నారు. గోపాలపురం : ఎంపిడిఒ, తహశీల్దార్‌ కార్యాలయాల వద్ద ఎంఎల్‌ఎ తలారి వెంట్రావు పతాకావిష్కరణ చేశారు. స్వాతంత్య్ర సమరయోధులను అందరూ స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. జనసేన పార్టీ ఆధ్వర్యంలో నియోజకవర్గ నాయకులు దొడ్డిగర్ల సువర్ణ రాజు జెండా ఆవిష్కరించారు. ఆసుపత్రిలో రోగులకు పండ్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి ఉండవల్లి సత్యనారాయణ, సొసైటీ అధ్యక్షులు కూసం రామ్మోహన్‌రెడ్డి, ప్రభుత్వ జూనియర్‌ కళాశాల చైర్మన్‌ వెలగా శ్రీరామ్మూర్తి, ఎంపిడిఒ ఆర్‌.శ్రీదేవి, తహశీల్దార్‌ బి.రవీంద్రనాథ్‌ పాల్గొన్నారు.