Jul 22,2023 15:38

విద్యార్థులను అభినందిస్తున్న ప్రిన్సిపల్‌ సంపత్‌కుమార్‌

ప్రజాశక్తి - గోపాలపురం
కొండవీటి డిగ్రీ కళాశాలలో చదువుతున్న విద్యార్థులు ఎపి పీజీ సెట్‌లో రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమ ఫలితాలు సాధించారని ఆ విద్య సంస్థల సెక్రటరీ, కరస్పాండెంట్‌ కెఎస్‌డి.ఆశీర్వాదం తెలిపారు. గోపాలపురంలోని కొండవీటి డిగ్రీ కళాశాలలో తృతీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు గొల్ల కావ్య సైకాలజీ విభాగంలో 25వ ర్యాంకు, ముప్పిడి శాంతిప్రియ గణిత విభాగంలో 74వ ర్యాంకు, తాడేపల్లి రాణి తెలుగు విభాగంలో 93వ ర్యాంకు, కొడమంచిలి సుమ వాణిజ్య విభాగంలో 94వ ర్యాంకు, కొడమంచిలి సృజన వృక్ష శాస్త్రంలో 211వ ర్యాంకులను సాధించారన్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్‌ సంపత్‌ కుమార్‌ విద్యార్థులకు పుష్పగుచ్చాలు అందించి అభినందనలు తెలిపారు. మరిన్ని విజయాలు సాధించి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు.