ప్రజాశక్తి-కడియం వివాహాది శుభకార్యాలకు వచ్చే బంధుమిత్రులకు రకరకాల గిఫ్ట్‌లు ఇవ్వడం మనకు తెలిసిందే. కొత్తగా పెళ్లయిన ఆ జంట ప్రకతి సంరక్షణపై మక్కువతో వందలాది మొక్కలను పంపిణీ చేశారు. మండలంలోని దుళ్ల గ్రామానికి చెందిన ఈడుపుగంటి భూపయ్య చౌదరి కుమార్తె శ్రీలక్ష్మి కావ్య, ధీరజ్ కష్ణ చైతన్య వివాహ వేడుకలో వచ్చిన ప్రతి ఒక్కరికీ మొక్కలను అందజేశారు. ఈ మొక్కలను తీసుకెళ్లడానికి ప్రత్యేక ప్యాకింగ్ కూడా చేయించారు. వేదికను కూడా పచ్చని మొక్కలు, ఆకులతో తీర్చిదిద్దారు. ఈ వేడుకల్లో కడియం ఎంపిపి వెలుగుబంటి సత్య ప్రసాద్, దుళ్ల సర్పంచ్ కొండపల్లి పట్టియ్య, ఉప సర్పంచ్ తోకల శ్రీనివాసరావు, మాజీ సర్పంచ్ గుర్రపు సత్యనారాయణ, మాజీ ఎంపిటిసిలు టేకి శ్రీనివాస్, ఈదర నందబ్బు, నర్సరీ రైతు దూలం రాజ్‌కుమార్, తదితరులు పాల్గొన్నారు.










