ప్రజాశక్తి-బిక్కవోలు : బలబద్రపురం గ్రామంలో రైతులకు వ్యవసాయ వరి కోత మిషన్ ను అనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాయి సత్య శ్రీనివాస్ గ్రూప్ రైతులకు 25 లక్షలు విలువచేసే వరి కోత మిషన్ ను అందించడం జరిగిందని, దీనికి 8 లక్షల 80 వేల రూపాయల సబ్సిడీ లభిస్తుందని అదేవిధంగా DCCB బ్యాంకు 12 లక్షల 50 వేల రూపాయలలోను రూపంలోనూ డిపాజిట్ రూపంలో రైతులు 3 లక్షల 70 వేల రూపాయలు చెల్లించడం జరిగిందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ సలహా మండలి చైర్మన్ నల్లమిల్లి వెంకటరెడ్డి, సర్పంచ్ బుంగ రామారావు, ఫైనాన్స్ సత్తిబాబు, నల్లమిల్లి రాము, ఎల్ల బుచ్చిలింగం, కాంట్రాక్టర్ చంటి, సాయి సత్య శ్రీనివాస్ గ్రూప్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.










