Jul 05,2023 22:57

విద్యార్థులతో మాట్లాడుతున్న కలెక్టర్‌ మాధవీలత

ప్రజాశక్తి - పెరవలి
మండలంలోని మల్లేశ్వరం ఎస్‌సి ఏరియాలో ఉన్న నెంబర్‌-2 మండల పరిషత్‌ పాఠశాలను కలెక్టర్‌ డాక్టర్‌ కె.మాధవీలత బుధవారం డిఇఒ అబ్రహాంతో కలిసి పరిశీలించారు. విద్యార్థులు, వారి తల్లితండ్రులతో మాట్లాడారు. మెనూపై ఆరా తీశారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడారు. నాడు-నేడులో వచ్చిన రూ.12 లక్షలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. స్థానికుల సహకారంతో స్కూల్‌ను అభివృద్ధి చేయాలన్నారు. తల్లితండ్రుల విజ్ఞప్తి మేరకు అదనపు తరగతి నిర్మాణం కోసం చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ తెలిపారు. సోమవారం నుంచి పిల్లలు కొత్త యూనిఫాంతో పాఠశాలకు వచ్చేలా చూడాలన్నారు. ప్రతి రోజూ స్కూల్‌లో అందించే పౌష్టిక ఆహారం తీసుకోవాల న్నారు. ఆమె వెంట ఎంఇఒ బి.బాలసుబ్ర హ్మణ్యం, మండల విద్యాశాఖ అధికారులు వివిఎస్‌.స్వరూప్‌, షేక్‌ సుర్జాన్‌, హెచ్‌ఎం శ్రీనివాస్‌, తహశీల్దార్‌ టి.తహశీల్దార్‌ టి.రాజరాజేశ్వరి, మల్లేశ్వరం సర్పంచ్‌ బొలిశెట్టి రత్నమాల, బొలిశెట్టి పట్టాభి రామారావు తదితరులు పాల్గొన్నారు.