ప్రజాశక్తి-గోపాలపురం ప్రభుత్వం, ప్రజల మధ్య వారధిగా పనిచేస్తున్న పత్రికా విలేకరులకు రూ.10 లక్షల ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని గోపాలపురం ప్రింట్ మీడియా అధ్యక్షులు ఆబోతు అనిల్ కుమార్ కోరారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడిన కొయ్యలగూడెం మండలం గవరవరానికి చెందిన తప్పెట్ల శ్రీనివాస్‌ను గురువారం పరామర్శించి రూ.పది వేల సాయం అందించారు. అనంతరం అనిల్ కుమార్ మాట్లాడుతూ. పాత్రికేయ వత్తిని కార్మిక చట్టం పరిధిలోకి తీసుకొచ్చి గౌరవ వేతనం ప్రకటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షులు, దాసరి రామారావు, కార్యదర్శి జంగా వెంకటరామిరెడ్డి, సహాయ కార్యదర్శి సిర్రా కపారావు, కోశాధికారి తిగిరిపల్లి గాబ్రియేలు, సభ్యులు ఎం.హరికృష్ణ, కొడమంచిలి మాణిక్యం, జానపాటి రత్నకిషోర్, పాముల తిరుపతిరావు పాల్గొన్నారు.










