ప్రజాశక్తి - కొవ్వూరు రూరల్
జిల్లాలో పారిశ్రామిక అభివద్ధి కోసం చర్యలు తీసుకోవడం ద్వారా స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నామని కలెక్టర్ డాక్టర్ కె.మాధవీలత పేర్కొన్నారు. మంగళవారం ఐ.పంగిడిలో త్రివేణి రెన్యూవేబుల్ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమను కలెక్టర్ సందర్శించారు. ఆమె మాట్లాడుతూ రూ.1350 కోట్లతో ఏర్పాటు చేస్తున్న పరిశ్రమ ద్వారా 2,400 మందికి ఈ పరిశ్రమ ద్వారా ఉద్యోగావకాశాలు వస్తాయని కలెక్టర్ తెలిపారు. పరిశ్రమకు చెందిన మౌలిక సదుపాయాలు కల్పన కోసం కంపెనీ ప్రతినిధులు కలెక్టర్‌కు నివేదిక ఇచ్చారు. కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ వరుణ్‌గుప్త పరిశ్రమను త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. అందుకు సంబంధించిన పనులు పూర్తి అయ్యాయని వివరించారు. పునరుత్పత్తి సామర్థ్యం కలిగి గ్లాస్ ఉత్పత్తి చేసే విధానంపై కలెక్టర్‌కు వివరించారు. కలెక్టర వెంట ఆర్‌డిఒ ఎస్.మల్లిబాబు, జిల్లా పరిశ్రమల అధికారి బి.వెంకటేశ్వరరావు, పంచాయతీరాజ్ ఎస్‌ఇ ఎబివి.ప్రసాద్, తహశీల్దార్ బి.నాగరాజునాయక్ తదితరులున్నారు.










