ప్రజాశక్తి-రాజమహేంద్రవరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కెఎస్.జవహర్ రెడ్డి వెలగపూడి నుంచి కలెక్టర్‌తో వ్యవసాయ, పర్యాటక రంగం, రెవెన్యూ, హౌసింగ్, పంచాయతీరాజ్ అంశాలపై గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. స్థానిక కలెక్టరేట్ నుంచి కలెక్టర్ డాక్టర్ కె.మాధవీలత, జెసి ఎన్.తేజ్ భరత్ ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత జిల్లా ప్రగతిపై వివరాలు తెలిపారు. పర్యాటక శాఖకు భూ కేటాయింపులకు సంబంధించి 4 పరాయీకరణ ప్రతిపాదనల్లో ఒక ప్రతిపాదనకు సంబంధించి సిసిఎల్‌ఎకు ప్రతిపాదనలు పంపినట్లు కలెక్టర్ మాధవీలత తెలిపారు. పర్యాటక రంగం అభివద్ధి కోసం చేపడుతున్న పనులకు ముందస్తు ప్రతిపాదనలు సిద్ధం చేసి సమర్పించాలని కలెక్టర్లను ప్రధాన కార్యదర్శి ఆదేశించిన దష్ట్యా ప్రతిపాదనలు అందచేయాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు.
వైఎస్‌ఆర్ రైతు సేవా యంత్ర పరికరాల నిమిత్తం 136 గ్రూపులు 50 శాతం వారి వాటా మొత్తం చెల్లించాయని,వాటిలో 108 గ్రూప్స్‌కు పరికరాలు సరఫరా చేశారని, మిగిలిన యూనిట్స్ మే మూడో వారం నాటికి సరఫరా చేసేలా అధికారులకు నిర్ధేశం చేసినట్లు కలెక్టర్ వివరించారు. జిల్లాలోని 162 గ్రూపుల్లో 86 గ్రూప్స్ ట్రాక్టర్ కోసం ఆప్షన్ ఇచ్చినట్టు ఆ మేరకు బ్యాంకర్స్‌తో యూనిట్స్ సరఫరాకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.
డ్రోన్ పైలట్ ప్రాజెక్టు కోసం ఈ ఏడాది 54 యూనిట్స్ లక్ష్యం కాగా జూలై 23 నాటికి నిర్ధేశించిన 20 యూనిట్స్‌లో 16 రైతు గ్రూప్స్, 3 నిరుద్యోగ యువత గ్రూప్స్ ఏర్పాటు చేసి, ఆ మేరకు 19 డ్రోన్ ప్రాంతాలను గుర్తించినట్టు మాధవీలత పేర్కొన్నారు. హార్టికల్చర్ అధికారుల ద్వారా 35 శాతం 7 యూనిట్స్‌కు సంబంధించిన ప్రతిపాదనను సమర్పించామన్నారు. డ్రోన్ పైలట్ ప్రాజెక్టుపై 5 గ్రూపులకు శిక్షణ ఇచ్చామన్నారు.
జిల్లాలో 3,56,583 ఇళ్లకు గాను 288254 ఇళ్లకు మంచినీటి కుళాయి కనెక్షన్లు ఇచ్చినట్టు చెప్పారు. జల జీవన్ మిషన్ కింద మిగిలిన 67,329 ఇళ్లకు సంబంధించి నెలవారీ లక్ష్యాలను నిర్ధేశించనున్నట్లు తెలిపారు. వేసవి దష్ట్యా తాగునీరు సరఫరా కోసం పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో అనుబంధ చర్యలు తీసుకోవాలని క్షేత్ర స్థాయి అధికారులను ఆమేరకు ఆదేశాలు జారీ చేశామన్నారు.
జిల్లాలో జగనన్న హౌసింగ్ కాలనీల్లో 78,312 గహాలకు 372 పనులను రూ.1.67 కోట్లతో కుళాయి కనెక్షన్లుకు గాను ప్రతిపాదించగా 94 పనులకు టెండర్ ప్రక్రియ పూర్తి చేశామన్నారు. ఇప్పటి వరకు రూ. 25.64 లక్షలతో పనులు చేపట్టడం జరిగిందన్నారు. రూ.17.56 లక్ష లతో తాత్కాలిక పనులు, రూ. 8.08 లక్షలతో శాశ్వత పనులు పూర్తి చేశామన్నారు.
జగనన్న భూ హక్కు భూ రక్షా పత్రాల పంపిణీలో భాగంగా జిల్లాకు సంబంధించిన 29,895 పత్రాల్లో ఇప్పటివరకు 28,188 (94.29 శాతం) మేర పంపిణీ చేశామన్నారు. జిల్లాలో 32,225 భూ హక్కు పత్రాలు జనరేషన్‌కు గాను 32,063 పత్రాలు పూర్తి చేశామని, మిగిలిన 162లో సాంకేతిక పరమైన అంశాల కారణంగా జెనరేట్ కాలేదని కలెక్టర్ తెలియచేశారు.
జిల్లాలో 44 గ్రామాల్లో స్టోన్ ప్లాంటేషన్ చేపట్టవలసి ఉండగా 33 గ్రామాల్లో పూర్తి చేశామని, 6 చోట్ల పురోగతిలో ఉండగా, ఇంకా 5 గ్రామాలకు చెందిన మెటీరియల్ అందవలసి ఉందని కలెక్టర్ వివరించారు. 72,485 స్టోన్స్ జిల్లాకు సరఫరా అవ్వగా 66,603 మేర లక్ష్యాలను సాధించామన్నారు.
హార్టికల్చర్ సాగు విస్తీర్ణంలో డ్రిప్ ఇరిగేషన్ ప్రాజెక్టుల కింద 2530 మంది రైతుల ద్వారా 3 వేల హెక్టార్లలో సాగు విస్తీర్ణం చేపడుతన్నట్టు కలెక్టర్ పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆధ్వర్యంలో సమీకత వ్యవసాయ పద్ధతులు ద్వారా 800 హెక్టర్లు, రాష్ట్రీయ కషి యోజన పథకం అమలులో 300 హెక్టార్ల లో, ఎడిబుల్ ఆయిల్స్ ఉత్పత్తి 3500 హెక్టర్ల లో డ్రిప్ ఇరిగేషన్ ప్రాజెక్టులను అధిక సాగు విస్తీర్ణం చేపట్టడం జరుగుతున్నట్లు పేర్కొన్నారు.
జాబ్ కార్డ్ హౌల్డర్లందరికీ వంద రోజుల వేతన ఉపాధిని అందించడానికి తగినన్ని పనులు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి వర్క్‌సైట్‌లో షేడ్స్, తాగునీటి సౌకర్యం, ప్రథమ చికిత్స వస్తు సామగ్రి వంటి వర్క్‌సైట్ సౌకర్యాలను కల్పించాలన్నారు. వేసవిని దష్టిలో ఉంచుకొని ఎట్టి పరిస్థితుల్లోనూ పనులను ఉదయం 11.00 లోపు మధ్యాహ్నం 3.00 గంటల తరువాత మాత్రమే చెయ్యాలన్నారు. వేతన ఉపాధిని కల్పించడంలో పేదలు, వికలాంగులైన వేతన ఉద్యోగార్థులపై ఎక్కువ దష్టి సారించాలన్నారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో డిఆర్‌ఒ జి.నరసింహులు, ఆర్‌డిఒలు ఎస్.మల్లిబాబు, ఎ.చైత్రవర్షిణి, ఎడి సర్వే పి.లక్ష్మణరావు, సిపిఐ కె.ప్రకాశరావు, డిపిఒ పి.జగదాంబ, టూరిజం రీజనల్ డైరెక్టర్ వి.స్వామినాయుడు, ఇన్‌ఛార్జి జిల్లా హౌసింగ్ అధికారి జి.పరశురామ్, జిల్లా పశుసంవర్థక శాఖాధికారి ఎస్‌జిటి.సత్యగోవిందం, మైక్రో ఇరిగేషన్ అధికారి ఎస్.రామ్మోహన్, డ్వామా పీడీ జిఎస్.రామ్‌గోపాల్, పాల్గొన్నారు.










