ప్రజాశక్తి - రాజమహేంద్రవరం పాలిటెక్నిక్ ఎంట్రన్స్ పరీక్షా ఫలితాల్లో తమ ఐఐటి, మెడికల్ అకాడమీ విద్యార్థులు రాష్ట్రస్థాయిలో ఉత్తమ ర్యాంకులు సాధించారని తిరుమల విద్యాసంస్థల చైర్మన్ నున్న తిరుమలరావు తెలిపారు. 11 మంది 120/120 మార్కులు సాధించి స్టేట్ ప్రథమ ర్యాంకును సాధించారని, 14 మంది 119/120 మార్కులు సాధించారని, టాప్ 50లో 25 ర్యాంకులు, టాప్ 100లో 32 ర్యాంకులను సాధించి అత్యుత్తమ ఫలితాలను సాధించారని తెలిపారు. పి.గేయ, సాయి హర్షిత్, ఎ.కష్ణ సాహిత్, యు.జితు కౌముది, కె.వెంకటరామ వినీష్, డి.రూపిక, ఎస్.గౌతమ్, కె.యశ్వంత్ సాత్విక్, డి.ఆశిష్ సాయి శ్రీకర్, జి.గీతిక, వి.తేజశ్రీ, కె.శంకర్ మానిక్ స్టేట్ 1వ ర్యాంకును సాధించారన్నారు. ర్యాంకులు సాధించిన విద్యార్థులను డైరెక్టర్ సరోజినీదేవి, అకడమిక్ డైరెక్టర్ జి.సతీష్ బాబు, ప్రిన్సిపల్ వి.శ్రీహరితో కలిసి తిరుమలరావు అభినందించారు.










