Jun 22,2023 00:57

ప్రజాశక్తి-రాజమహేంద్రవరం రూరల్‌
ఓటర్ల జాబితా రూపకల్పనలో బూత్‌ స్థాయి సిబ్బంది నిబద్ధతతో పనిచేయాలని ఉండాలని మునిసిపల్‌ కమిషనర్‌ కె.దినేష్‌ కుమార్‌ స్పష్టం చేశారు. బుధవారం ఉదయం స్థానికఆనం కళా కేంద్రం ఆడిటోరియం లో 50వ అసెంబ్లీ నియోజక వర్గ బిఎల్‌వొ, ఇతర ఎన్నికల అధికారులతో శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్‌ దినేష్‌కుమార్‌ మాట్లాడుతూ రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ పరిధిలో ఉన్న ఓటర్ల తుది జాబితా రూపుదిద్దే ప్రక్రియలో ఎలక్టోరల్‌ రేషియో, జెండర్‌ రేషియో హేతుబద్ధత కలిగి ఉండాలన్నారు. స్పెషల్‌ సమ్మరీ రివిజన్‌ 2024 కింద నియోజకవర్గ పరిధిలో ఓటర్ల జాబితా రూపుదిద్దడంలో బూత్‌ స్థాయి సిబ్బంది నిబద్ధతతో పనిచేయాలని పేర్కొన్నారు. ఫారమ్‌ 6 ద్వారా 929 దరఖాస్తులు రాగా 777 ఆమోదించి 67 తిరస్కరించామన్నారు. ఫారం 7 ద్వారా 122 దరఖాస్తులు రాగా 30 ఆమోదించి 17 తిరస్కరించామన్నారు. ఫారం 8 ద్వారా 357 దరఖాస్తులు రాగా 288 ఆమోదించి 31 తిరస్కరించామని, మిగిలినవి పరిశీ లన దశలో ఉన్నట్లు తెలిపారు. జనాభా ఆధారంగా ఇపి రేషియో 714 ఉందని, జెండర్‌ రేషియో 1012 ఉందని,అదే విధంగా దర్థ్‌ జెండర్‌ కి చెంది 63 మంది నమోదు అయ్యారన్నారు.. సామాజిక భద్రత పెన్షన్‌ ఆధారంగా థర్థ్‌ జెండర్‌ కి చెందిన ఓటర్ల నమోదు చేపట్టాలన్నారు. 18 నుంచి19 మధ్య ఉన్న యువత 2181 మంది ఉన్నారని, వారిలో 117 మంది ఓటు హక్కు కలిగి ఉన్నారని అన్నారు. 17 నుంచి18 మధ్య ఉన్న 201 మంది ముందస్తుగా దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు.
ఎస్‌ఎస్‌ఆర్‌ ప్రక్రియ..
1,జూలై 21 నుంచి ఆగస్టు 21 వరకూ బిఎల్‌ఒల ఇంటింటా పరిశీలన. 2,అక్టోబరు 17 న సమగ్ర ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురణ.3, అక్టోబరు 17 నుంచి నవంబరు 30 వరకూ క్లైమ్‌లు మరియు అభ్యంతరాల స్వీకరణ.4,
క్లెయిమ్‌ లు మరియు అభ్యంతరాల స్వీకరణకు అక్టోబరు 28, 29 మరియు నవంబరు 18, 19 తేదీల్లో బూత్‌ స్థాయిల్లో ప్రత్యేక క్యాంపులు.4, డిశంబరు 26 కల్లా క్లైమ్‌ లు మరియు అభ్యంతరాల పరిష్కారం.5, జవనరి 5 న తుది ఓటర్ల జాబితా ప్రచురణ
అపరాధ రుసుము లేకుండా ఈ నెల 30వరకు
ఆస్తిపన్ను చెల్లింపునకు గడువు
2023-2024 మొదటి అర్థసంవత్సరము యొక్క ఆస్థిపన్ను అపరాధ రుసుము లేకుండా చెల్లించే గడువు ఈ నెల30వ తేదీతో ముగుస్తుందని రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కమిషనర్‌ బుధవారం తెలిపారు. ఆస్థిపన్ను చెల్లింపులు నగరపాలక సంస్థ స్పెషల్‌ కౌంటర్‌ నందు గాని సంబంధిత వార్డు సచివాలయము నందు గాని ఆన్‌ లైన్‌ నందు గాని పురసేవా యాప్‌ నందు గాని, చెక్కులు / డి.డి.ల ద్వారా గాని ఆస్థిపన్ను చెల్లించవచ్చునని తెలియజేశారు. వార్డు సచివాలయములో చెక్కులు / డి.డి.లను కూడా అందచేయవచ్చునని అన్నారు.