Oct 04,2023 23:30

గోదావరిలో జలదీక్ష చేస్తున్న ఎంఎల్‌ఎ గోరంట్ల

ప్రజాశక్తి - రాజమహేంద్రవరం రూరల్‌
రాబోయే ఎన్నికల్లో ఓటమి తప్పదని భావించిన జగన్‌ రెడ్డి ప్రభుత్వం ప్రతిపక్ష నేత చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేసి జైలు పాలు చేసిందని టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యులు, ఎంఎల్‌ఎ గోరంట్ల బుచ్చయ్య చౌదరి ధ్వజమెత్తారు. నగరంలోని గౌతమీ ఘాట్‌ వద్ద గోదావరిలో బుధవారం టిడిపి శ్రేణులు జలదీక్ష చేశారు. ఈ కార్యక్ర మంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ రాజ్యాంగ వ్యవస్థలను మేనేజ్‌ చేస్తూ ఎటువంటి ఆధారాలు లేకుండా బాబును రాష్ట్ర ప్రభుత్వం అరెస్టు చేసిందని పేర్కొన్నారు. లక్షల కోట్ల అవినీతికి పాల్పడిన జగన్‌ రెడ్డి ఎటువంటి అవినీతి మచ్చలేని చంద్రబాబుపై రాజకీయ కక్ష తీర్చుకుంటున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో ధమనకాండకు పాల్పడు తున్న ప్రభుత్వం ఆదేశాలతో పోలీసులు అర్థరాత్రులు దొంగల్లా గోడలు దూకి, ఇంటి తలుపులను బద్దల కొట్టి టిడిపి నాయకులను అరెస్టులు చేస్తున్నారని ఆరోపించారు. ప్రతిపక్ష పార్టీల ముఖ్య నాయకులం దరినీ జైల్లో పెట్టి రాబోయే ఎన్నికల్లో గెలవాలనే కుట్రలతో వైసిపి ప్రభుత్వం ఇటువంటి దుర్మార్గాలకు పాల్పడుతుందని విమర్శంచారు. టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కష్ణ మాట్లాడుతూ రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం ఆటవిక, అరాచక పాలనకు స్వస్తి పలికేందుకు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సిద్ధంగా ఉన్నారని, ఒక విజన్‌ ఉన్న నాయకుడిని, అభివృద్ధి ప్రధాతను అక్రమంగా అరెస్ట్‌ చేసి ఇబ్బంది పెడుతుందని అన్నారు. జలదీక్షలో టిడిపి నాయ కులు మచ్చేటి ప్రసాద్‌, వి.రఘురామ్‌, సిహెచ్‌. శ్రీనివాస్‌, పి.అప్పారావు, డిప్రసాద్‌, కె.ప్రసాద్‌, బి. నాగేశ్వరావు, ఆళ్ల ఆనందరావు పాల్గొన్నారు.