ప్రజాశక్తి-పెరవలి : మండలం ముక్కామల తూర్పుగోదావరి జిల్లా గ్రామంలో మే నెల మొదటి వారం నుండి ఉపాధి హామీ పనులు ముమ్మరంగా తవ్వకాలు చేస్తున్నామని గ్రామ సర్పంచ్ కేతా త్రిమూర్తులు తెలిపారు. శుక్రవారం కొండలమ్మ గుడి ప్రాంతంలో ఉన్న పిల్ల కాలువ పూడిక తీత తీస్తున్న సుమారు 100 మంది ఉపాధి హామీ కూలీలకు పెరవలి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ఉన్న సబ్ సెంటర్ ముక్కామల మెడికల్ సిబ్బంది ఆధ్వర్యంలో సుమారు 80 మంది కూలీలకు టీటీ ఇంజక్షన్లు రెండు ఓఆర్ఎస్ ప్యాకెట్స్ మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ వేండ్ర శ్రీనివాస్ ఎంపీటీసీ గండేపల్లి రామకృష్ణ ఫీల్డ్ అసిస్టెంట్ దొంగ సత్యనారాయణ వైద్యులు వెంకటపతి ఏఎన్ఎం ఆశ వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.










