ప్రజాశక్తి - ఉండ్రాజవరం: నాలుగు సంవత్సరాల వైయస్సార్సీపి పరిపాలనలో జరిగిన అభివృద్ధిని చూసి రానున్న 2024 సాధారణ ఎన్నికలలో జగన్మోహన్ రెడ్డిని మరోసారి ముఖ్యమంత్రిగా ఎన్నుకోవాలన్నారు ఉండ్రాజవరం మండల పరిషత్ అధ్యక్షురాలు పాలాటి యల్లారీశ్వరి. సోమవారం మండలంలోని పాలంగి గ్రామంలో జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమంలో భాగంగా కన్వీనర్లు, గృహసారధులతో కలిసి ఆమె ఇంటింటికి వెళ్లి రాష్ట్రంలో గత నాలుగేళ్లుగా జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను, సంక్షేమ పథకాలను వివరించినట్లు తెలిపారు. వివిధ సంక్షేమ పథకాల లబ్ధిదారులకు జగనన్న మా భవిష్యత్తు స్టిక్కర్లను అందజేశారు. ఈ సందర్భంగా మరోసారి నిడదవోలు ఎమ్మెల్యేగా జి శ్రీనివాస నాయుడును గెలిపించుకోవాల్సిన ఆవశ్యకత ప్రజలకు ఉందన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి నాయకులు పాలాటి శరత్, అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.










