ప్రజాశక్తి - చాగల్లు : సమైక్యాంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు శతజయంతి వేడుకలు ఆదివారం తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షుడు దొంగ రామకృష్ణ ఆధ్వర్యంలో చాగల్లు మెయిన్ బజార్ లో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి, కేకులు కట్ చేసి, మిఠాయిలు పంచి తమ అభిమాన నేతపై ఉన్న అభిమానాన్ని చాటుకుని ఘన నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు నాదెళ్ల శ్రీరామ చౌదరి. ఆళ్ల హరిబాబు తాలూరి ప్రసాద్. మండలంలో నాయకులు పాల్గొని ఘనంగా నివాళులర్పించారు అనంతరం రాజమండ్రి మహానాడు కార్యక్రమానికి భారీ మోటార్ సైకిల్ ర్యాలీతో వెళ్లారు










