ప్రజాశక్తి - ఉండ్రాజవరం : మండల కేంద్రం ఉండ్రాజవరం ఎంపీపీ స్కూల్ నెంబర్1 విద్యార్థినీ, విద్యార్థులకు బుధవారం యన్నమణి నారాయణరావు ఆర్థిక సహకారంతో నోటుబుక్ లు పంపిణీ చేశారు. సుమారు పదివేల రూపాయల విలువైన నోటుబుక్కలను తమ పిల్లలకు ఉచితంగా పంపిణీ చేయడంతో దాత నారాయణ రావు కు విద్యార్థుల తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పేరెంట్స్ కమిటీ చైర్మన్ టి బాలాజీ, కేశవ స్వామి గుడి చైర్మన్ రామకృష్ణ, గ్రామ పెద్ద సుధాకర్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.










